Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అమరావతి

కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ గడువు పొడిగింపు:నరమల సతీష్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ గడువు పొడిగింపు:నరమల సతీష్

వార్త ముఖ్యాంశాలు

  • ఆంధ్రప్రదేశ్‌లో అర్హులైన కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులరైజేషన్ కోసం దరఖాస్తులు సమర్పించే గడువును డిసెంబర్ 31 వరకు పొడిగించినట్లు కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఫెడరేషన్ నెల్లూరు జిల్లా చైర్మెన్ సతీష్ తెలిపారు.
  • ఉద్యోగులు నిధి పోర్టల్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చని పేర్కొన్నారు.
  • సెప్టెంబర్ 30తో ముగిసిన గడువులో సాంకేతిక సమస్యల కారణంగా కొందరు దరఖాస్తు ప్రక్రియను పూర్తిచేయలేకపోయారని వివరించారు.

ఆంధ్రప్రదేశ్‌లో అర్హులైన కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులరైజేషన్ కోసం దరఖాస్తులు సమర్పించే గడువును డిసెంబర్ 31 వరకు పొడిగించినట్లు కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఫెడరేషన్ నెల్లూరు జిల్లా చైర్మెన్ సతీష్ తెలిపారు. ఉద్యోగులు నిధి పోర్టల్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చని పేర్కొన్నారు.

సెప్టెంబర్ 30తో ముగిసిన గడువులో సాంకేతిక సమస్యల కారణంగా కొందరు దరఖాస్తు ప్రక్రియను పూర్తిచేయలేకపోయారని వివరించారు. వారికి నష్టం కలగకుండా కాంట్రాక్ట్ ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం గడువును పొడిగించినట్లు తెలిపారు. డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ పరిధిలోని కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా ఈ గడువు పొడిగింపు వర్తిస్తుందని సతీష్ పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని ఆలోపు 100% గ్రాస్ శాలరీ ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *