Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
BHADRADRI

కలెక్టరేట్‌లో రక్షాబంధన్ వేడుకలు…

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
కలెక్టరేట్‌లో రక్షాబంధన్ వేడుకలు…

వార్త ముఖ్యాంశాలు

  • భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 28: రక్షాబంధన్ సందర్భంగా జిల్లా కలెక్టరేట్‌లో ఘనంగా వేడుకలు నిర్వహించారు.
  • చిల్డ్రన్ హోమ్ బాలికలు జిల్లా కలెక్టర్ అంకిత్‌తో పాటు అదనపు కలెక్టర్లు, జిల్లా సంక్షేమాధికారి, ఇతర అధికారులకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు.
  • అధికారులు బాలికలతో ఆప్యాయంగా మాట్లాడి వారి విద్య, భవిష్యత్ లక్ష్యాలు, అభిరుచులను తెలుసుకున్నారు.

భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 28: రక్షాబంధన్ సందర్భంగా జిల్లా కలెక్టరేట్‌లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. చిల్డ్రన్ హోమ్ బాలికలు జిల్లా కలెక్టర్ అంకిత్‌తో పాటు అదనపు కలెక్టర్లు, జిల్లా సంక్షేమాధికారి, ఇతర అధికారులకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. అధికారులు బాలికలతో ఆప్యాయంగా మాట్లాడి వారి విద్య, భవిష్యత్ లక్ష్యాలు, అభిరుచులను తెలుసుకున్నారు. బాలికలకు మధ్యాహ్న భోజనంతో పాటు పుస్తకాలు, పెన్నులు, స్వీట్స్ తదితర బహుమతులు అందజేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ బాలికలు కుటుంబానికే కాకుండా సమాజానికి, దేశానికి విలువైన సంపద అన్నారు. ప్రతి బాలికకు సురక్షిత వాతావరణం, నాణ్యమైన విద్య అందించడంతో పాటు వారు తమ కలలను సాకారం చేసుకునేలా ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. బాలికల రక్షణ, విద్య, ఆరోగ్యం, సాధికారతకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో హబ్ మిషన్ కోఆర్డినేటర్ సంతోష రూప, స్వాతి, ప్రియాంక, మౌనిక, దీప్తి, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ వినోద్, బాలికలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *