Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కడప

కడప పాలనలో మార్పు రావాలి: సీపీఐ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కడప పాలనలో మార్పు రావాలి: సీపీఐ

కడప పాలనలో మార్పు రావాలి: సీపీఐ

పున్నమి ప్రతినిధి – కడప:

కడప మున్సిపల్ కార్పొరేషన్ పాలనలో సమూల మార్పు రావాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర డిమాండ్ చేశారు. నగర సమగ్రాభివృద్ధికి రూ.5,000 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ కేటాయించాలని కోరారు.

సోమవారం కార్పొరేషన్ కార్యాలయం వద్ద సీపీఐ ఆధ్వర్యంలో ‘కడప ప్రజాగర్జన’ నిర్వహించారు. నల్లజెండాలు, ప్లకార్డులతో నిరసన తెలిపారు. పేదలందరికీ రెండు సెంట్ల ఇంటి స్థలాలు, కొత్త రేషన్ కార్డులు, పింఛన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, పారిశుధ్య సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఎన్నికల హామీలను ప్రభుత్వం అమలు చేయాలని గాలి చంద్ర పేర్కొన్నారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కడప పాలనలో మార్పు రావాలి: సీపీఐ

కడప పాలనలో మార్పు రావాలి: సీపీఐ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *