అరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పొలిటికల్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో ఓటు హక్కు ప్రాధాన్యతపై క్విజ్, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ సీహెచ్ కేశవరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారి మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును యువత సద్వినియోగం చేసుకుని భవిష్యత్తులో సమర్థవంతమైన నాయకత్వాన్ని తీర్చిదిద్దాలని సూచించారు. 18 ఏళ్లు నిండిన ప్రతి విద్యార్థి ఓటు హక్కును వినియోగించుకోవాలని అధ్యాపకురాలు డాక్టర్ సంధ్యారాణి కోరారు. విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందించగా, ఎంపికైన వారిని మండల, జిల్లా స్థాయి పోటీలకు పంపించనున్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, ఎన్ఎస్ఎస్ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.

వార్తా మూలాలు
- Punnami Reportingపత్రికా ప్రకటన