Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అల్లూరి సీతారామరాజు

రోడ్డు ప్రమాద బాధితుడికి అండగా డీఎంహెచ్‌వో డాక్టర్ రియాజ్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
రోడ్డు ప్రమాద బాధితుడికి అండగా డీఎంహెచ్‌వో డాక్టర్ రియాజ్

వార్త ముఖ్యాంశాలు

  • సుంకరమెట్ట పీహెచ్‌సీలో విధులు ముగించుకుని తిరిగి వస్తున్న అల్లూరి సీతారామరాజు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రియాజ్, మార్గమధ్యంలో రోడ్డు ప్రమాదంలో స్పృహ కోల్పోయి పడి ఉన్న గుర్తుతెలియని వ్యక్తిని గమనించారు.
  • బాధితుడి పేరు, ఊరు తెలియకపోయినా వెంటనే స్పందించి, స్థానిక పీహెచ్‌సీకి సమాచారం ఇచ్చి అంబులెన్స్ రప్పించారు.
  • బాధితుడిని అరకు ఏరియా ఆసుపత్రికి తరలించేలా చర్యలు తీసుకున్నారు.

సుంకరమెట్ట పీహెచ్‌సీలో విధులు ముగించుకుని తిరిగి వస్తున్న అల్లూరి సీతారామరాజు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రియాజ్, మార్గమధ్యంలో రోడ్డు ప్రమాదంలో స్పృహ కోల్పోయి పడి ఉన్న గుర్తుతెలియని వ్యక్తిని గమనించారు. బాధితుడి పేరు, ఊరు తెలియకపోయినా వెంటనే స్పందించి, స్థానిక పీహెచ్‌సీకి సమాచారం ఇచ్చి అంబులెన్స్ రప్పించారు. బాధితుడిని అరకు ఏరియా ఆసుపత్రికి తరలించేలా చర్యలు తీసుకున్నారు.
అంతేకాకుండా ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్‌తో ఫోన్‌లో మాట్లాడి, తక్షణమే అత్యవసర వైద్యం అందించేలా చొరవ చూపారు. ప్రాథమిక చికిత్స అనంతరం బాధితుడి పరిస్థితిని బట్టి మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం కేజీహెచ్‌కు రిఫర్ చేయాలని సూచించారు. కేజీహెచ్ సూపరింటెండెంట్‌తో కూడా మాట్లాడి అవసరమైన వైద్య ఏర్పాట్లు చేయించారు. సకాలంలో వైద్య సహాయం అందేలా చూసిన డాక్టర్ రియాజ్ మానవత్వం, బాధ్యతాయుత స్పందనను జిల్లా ప్రజలు అభినందిస్తున్నారు.

వార్తా మూలాలు

  • Punnami Reportingఅధికారిక ప్రకటన

Leave a comment

Your email address will not be published. Required fields are marked *