Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
BHADRADRI

ఓటర్ల సవరణ ప్రక్రియ వేగవంతం చేయాలి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఓటర్ల సవరణ ప్రక్రియ వేగవంతం చేయాలి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి

కొత్తగూడెం, ఆగస్టు 29: ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం హైదరాబాద్‌ నుంచి ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు, ఈఆర్‌ఓలు, ఏఈఆర్‌ఓలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ నోటీసుల పంపిణీని వేగవంతం చేసి పెండింగ్‌లో ఉన్న అన్ని నోటీసులను సంబంధిత వ్యక్తులకు తప్పనిసరిగా అందజేయాలని సూచించారు. నోటీసులు అందజేసిన రోజు నుంచి ఏడు రోజుల గడువు పూర్తయిన అనంతరం విచారణ చేపట్టాలని తెలిపారు. ఫిర్యాదులు, అభ్యంతరాలపై నిర్దిష్ట గడువులో విచారణ నిర్వహించి, సంబంధిత రికార్డుల పరిశీలనను వేగవంతం చేయాలని ఆదేశించారు.
అనామలీస్‌, నో మ్యాపింగ్‌ జాబితాలను గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ఏజెంట్లకు అందుబాటులో ఉంచాలని సూచించారు. క్లెయిమ్స్‌, అభ్యంతరాల సమయంలో సమర్పించాల్సిన పత్రాలు, ఆధారాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు విస్తృత ప్రచారం నిర్వహించాలని తెలిపారు. క్లెయిమ్స్‌, అభ్యంతరాల ప్రస్తుత స్థితిని రోజువారీగా నోటీస్‌ బోర్డుపై నవీకరించాలని ఆదేశించారు. ప్రక్రియలో పారదర్శకత, జవాబుదారీతనం పాటిస్తూ నిర్ణీత గడువులో పనులు పూర్తి చేయాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పరిష్కార ప్రక్రియను సజావుగా నిర్వహించాలని సూచించారు. ఏఈఆర్‌ఓలకు అవసరమైన శిక్షణ అందించాలని, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించాలని తెలిపారు. జిల్లా కలెక్టర్‌ అంకిత్‌ మాట్లాడుతూ జిల్లాలో అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు సంబంధించి నోటీసులు జారీ చేసి యాప్‌లో వివరాలను నవీకరించినట్లు తెలిపారు. నోటీసుల హియరింగ్‌ ప్రక్రియను పూర్తి చేసి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని, భారత ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం నిర్ణీత గడువులో ప్రక్రియను పూర్తి చేస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఓటర్ల సవరణ ప్రక్రియ వేగవంతం చేయాలి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి

ఓటర్ల సవరణ ప్రక్రియ వేగవంతం చేయాలి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి

ఓటర్ల సవరణ ప్రక్రియ వేగవంతం చేయాలి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *