Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తూర్పు గోదావరి

ఒక్క నిర్ణయం వందల ప్రాణాలు కాపాడుతుంది – తూర్పుగోదావరి అధికారులకు ప్రజల విజ్ఞప్తి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఒక్క నిర్ణయం వందల ప్రాణాలు కాపాడుతుంది – తూర్పుగోదావరి అధికారులకు ప్రజల విజ్ఞప్తి

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి ప్రతినిధి తాళ్లపూడి :తూర్పుగోదావరి జిల్లా ట్రాఫిక్, రవాణా శాఖ అధికారులకు జిల్లా ప్రజల తరఫున ఇది ఒక వినమ్రమైన అత్యవసర విన్నపం.
  • హెల్మెట్ లేకపోతే జరిగే ప్రమాదాల గురించి అధికారులు ఎన్ని సార్లు చెప్పినా, హెచ్చరించినా, వాహనదారుల్లో ఇంకా పూర్తి అవగాహన రావడం లేదు.
  • దాని ఫలితంగా ప్రతిరోజూ రోడ్డు ప్రమాదాలు, ప్రాణనష్టం మన కళ్లముందే జరుగుతున్నాయి.

పున్నమి ప్రతినిధి తాళ్లపూడి :తూర్పుగోదావరి జిల్లా ట్రాఫిక్, రవాణా శాఖ అధికారులకు జిల్లా ప్రజల తరఫున ఇది ఒక వినమ్రమైన అత్యవసర విన్నపం. హెల్మెట్ లేకపోతే జరిగే ప్రమాదాల గురించి అధికారులు ఎన్ని సార్లు చెప్పినా, హెచ్చరించినా, వాహనదారుల్లో ఇంకా పూర్తి అవగాహన రావడం లేదు. దాని ఫలితంగా ప్రతిరోజూ రోడ్డు ప్రమాదాలు, ప్రాణనష్టం మన కళ్లముందే జరుగుతున్నాయి.
విజయవాడ నగరంలో ట్రాఫిక్ నియమాలను కఠినంగా అమలు చేస్తూ, హెల్మెట్ ధరించని వారిపై భారీ జరిమానాలు విధించడం వల్ల అక్కడ ప్రమాదాలు కొంతమేర తగ్గినట్టు అందరూ గమనిస్తున్నారు. అదే తరహాలో రాజమండ్రి నగరం మరియు పరిసర ప్రాంతాల్లో కూడా కఠినమైన ట్రాఫిక్ నియమాలు అమలు చేయాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.
ఇటీవల రెండు రోజుల క్రితం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కేవలం హెల్మెట్ ధరించి ఉంటే ముగ్గురు వ్యక్తులు ప్రాణాలతో బయటపడేవారని స్థానికులు భావిస్తున్నారు. ఈ సంఘటన అందరినీ కలచివేసింది. చట్టం సడలింపు ప్రాణాలకు ముప్పు అనే విషయం మరోసారి స్పష్టమైంది.
అధికారులారా, ఇది జరిమానాల విషయం కాదు… ఇది ప్రాణాల విషయం. హెల్మెట్ ధరించని వారిపై ఎలాంటి మినహాయింపులు లేకుండా కఠిన చర్యలు తీసుకుంటేనే ప్రజల్లో భయం కాదు, బాధ్యత పెరుగుతుంది. ప్రత్యేక డ్రైవ్‌లు, అవగాహన కార్యక్రమాలు, నిరంతర తనిఖీలు చేపట్టాలని జిల్లా ప్రజలు ఆశిస్తున్నారు.
ప్రాణం ఉన్నప్పుడు చట్టం పాటించడమే నిజమైన విజ్ఞత. ఒక చిన్న నిర్ణయం వందల కుటుంబాల్లో వెలుగు నింపగలదు. జిల్లా రహదారులు సురక్షితంగా మారేందుకు తక్షణమే కఠిన నిర్ణయం తీసుకోవాలని తూర్పుగోదావరి ప్రజలు అధికారులను వినమ్రంగా కోరుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *