Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
రంగారెడ్డి

ఐలమ్మ పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శం నాగులపల్లిలో వీరవనిత చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ఐలమ్మ పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శం నాగులపల్లిలో వీరవనిత చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలు

నాగర్ కర్నూల్ జిల్లా: కోడేరు మండల పరిధిలో నాగులపల్లి గ్రామంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు, వీరవనిత చాకలి ఐలమ్మ 131వ జయంతి సందర్భంగా నాగులపల్లి గ్రామంలో ఘనంగా నివాళులర్పించారు.
సీనియర్ నాయకులు మల్లేపల్లి జగన్మోహన్ రెడ్డి చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలు, రైతులు, అణగారిన వర్గాల హక్కుల కోసం ఐలమ్మ చేసిన పోరాటం చిరస్మరణీయమన్నారు.
అన్యాయానికి, దోపిడీకి వ్యతిరేకంగా ఆమె చూపిన ధైర్యం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
ఐలమ్మ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
మహిళా శక్తికి, ఆత్మగౌరవ పోరాటానికి చాకలి ఐలమ్మ ప్రతీకగా నిలిచారని అన్నారు.
కార్యక్రమంలో వివిధ కుల సంఘాల పెద్దలు మొగిలి బాలస్వామి, మండ్ల చంద్రయ్య, మొగిలి నారాయణ, రామకృష్ణ, శ్రీను పాల్గొన్నారు.
అలాగే ఆంజనేయులు, సుదర్శన్, సత్యనారాయణ, మాషన్న తదితరులు హాజరై నివాళులు అర్పించారు.
కోడేరు మండల అధ్యక్షులు దాసరాజుల రవి కూడా కార్యక్రమంలో పాల్గొని ఐలమ్మ సేవలను స్మరించుకున్నారు.
స్థానిక నాయకులు, సంఘాల ప్రతినిధులు చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనియాడారు.
వీరవనిత ఐలమ్మ త్యాగాలు, పోరాటం భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు.

ఐలమ్మ పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శం నాగులపల్లిలో వీరవనిత చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలు

ఐలమ్మ పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శం నాగులపల్లిలో వీరవనిత చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *