గాజువాక, నవంబర్ 6 (పున్నమి ప్రతినిధి): జీవీఎంసీ 96వ వార్డు గోపాలరెడ్డి నగర్‌లోని శ్రీ కనకదుర్గాదేవి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వార్డు కార్పొరేటర్ గంధం శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు.
ఇటీవల జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లో గంధం శ్రీనివాసరావు ఘన విజయం సాధించారు. వరుసగా ఐదుసార్లు కార్పొరేటర్‌గా ఎన్నికై ఓటమి ఎరుగని నాయకుడిగా గుర్తింపు పొందారు. ఆయన విజయాన్ని కాంక్షిస్తూ మొక్కుకున్న పార్టీ కార్యకర్త కొయ్య శ్రీధర్ అమ్మవారి ఆలయంలో 101 కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ వార్డు ప్రజల సంక్షేమం, ప్రాంత అభివృద్ధే తన ప్రధాన ధ్యేయమని, ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ నిరంతరం సేవలందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు జిత్తుక అప్పలరాజు, కార్యదర్శి కూన వెంకట్రావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

