Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
విశాఖపట్నం

భీమిలి నియోజకవర్గం లో ఓటర్ తీర్పు… బ్యాలెట్ పెట్టెలో భద్రం.. ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
భీమిలి నియోజకవర్గం లో ఓటర్ తీర్పు… బ్యాలెట్ పెట్టెలో భద్రం.. ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు

వార్త ముఖ్యాంశాలు

  • ఆనందపురంలో అత్యధికంగా 84.75 శాతం ఓటింగ్ నమోదు..
  • నవంబర్ 7న ఫలితాలు!
  • **విశాఖపట్నం జిల్లా (పున్నమి ప్రతినిధి) నవంబర్ 6 ::** భీమిలి నియోజకవర్గంలో ఎన్నికల సందడి ముగిసింది..

ఆనందపురంలో అత్యధికంగా 84.75 శాతం ఓటింగ్ నమోదు.. నవంబర్ 7న ఫలితాలు!

**విశాఖపట్నం జిల్లా (పున్నమి ప్రతినిధి) నవంబర్ 6 ::**

భీమిలి నియోజకవర్గంలో ఎన్నికల సందడి ముగిసింది.. ఓటరు తీర్పు బ్యాలెట్ పెట్టెల్లో నిక్షిప్తమైంది! ఆనందపురం, భీమిలి, పద్మనాభం మూడు మండలాల పరిధిలో గురువారం నిర్వహించిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 44 ఎంపీటీసీ, 3 జడ్పీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు ఉత్సాహంగా పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

**ఆనందపురంలో ఓటరు చైతన్యం.. 84.75 శాతం!**

మూడు మండలాల్లో అత్యధికంగా ఆనందపురం మండలంలో 84.75 శాతం పోలింగ్ నమోదైంది. పద్మనాభం మండలంలో 81.91 శాతం, భీమిలి మండలంలో 80.97 శాతం ఓటింగ్ నమోదైంది. మొత్తం 164 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా సాగింది.

**భద్రత మధ్య బ్యాలెట్ పెట్టెల తరలింపు**

పోలింగ్ ముగిసిన అనంతరం బ్యాలెట్ పెట్టెలను పోలీసుల భద్రత మధ్య నిర్దేశిత కేంద్రాలకు తరలించి భద్రపరిచారు. భీమిలి, పద్మనాభం మండలాల బ్యాలెట్ పెట్టెలను దొరతోటలోని సెడార్ పాఠశాల ప్రాంగణానికి, ఆనందపురం మండలానికి సంబంధించిన బ్యాలెట్ పెట్టెలను మండల పరిషత్ కార్యాలయంలో భద్రపరిచారు.

**నవంబర్ 7న ఓట్ల లెక్కింపు.. ఎవరి వైపు ఓటరు మొగ్గు?**

ఇప్పుడు అందరి చూపు నవంబర్ 7న జరగనున్న ఓట్ల లెక్కింపుపైనే! గెలుపుపై అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తున్నా.. అసలు ప్రజాతీర్పు ఏమిటో తెలియాలంటే ఫలితాల వరకు వేచి చూడాల్సిందే. ఏ పార్టీకి ప్రజలు పట్టం కట్టారు? ఎవరికి విజయలక్ష్మి వరిస్తుంది? అన్న ఉత్కంఠ మూడు మండలాల రాజకీయ వర్గాల్లో నెలకొంది.

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *