Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఏసీ నగర్‌లో ఘనంగా వినాయక చవితి మహోత్సవం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఏసీ నగర్‌లో ఘనంగా వినాయక చవితి మహోత్సవం

-అన్నదానం, ప్రత్యేక పూజలు, తీర్థప్రసాదాల పంపిణీ
నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలోని ఏసీ నగర్‌ మల్లెల సంజీవయ్య మెమోరియల్ ప్రభుత్వ పాఠశాల వీధిలో ఏసీ నగర్ యువసేన ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. దాతల సహకారంతో భక్తులకు అన్నదానం చేశారు.
ఋషులు తపస్సు చేసే భంగిమపైన కొలువుదీరిన వినాయక విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఏసీ నగర్, బాలాజీనగర్, ఎన్టీఆర్ నగర్, వేపదొరువు తదితర సమీప ప్రాంతాల ప్రజలతో పాటు నగర నలుమూలల నుంచి విగ్రహాన్ని దర్శించేందుకు పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు.
హాజరైన భక్తులందరికీ నిర్వాహకులు తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా కొలువుదీరిన గణనాథుడికి నిర్వాహకులు, భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో నిర్వాహక కమిటీ సభ్యులు బాబు, నాగరాజు, సునీల్ కుమార్, మనోజ్, మహేష్, మంజునాథ్, అజయ్ బాబు, మధు, వెంకీ, శ్రీకాంత్, ఇందునిమిత్, పూజిత్, అబ్దుల్, మహి, హరి, ఆకుల దినేష్, ప్రవీణ్ స్వరూప్ తదితరులు పాల్గొన్నారు.

ఏసీ నగర్‌లో ఘనంగా వినాయక చవితి మహోత్సవం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *