Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అనకాపల్లి

ఏటికొప్పాకలో పంచాయతీ నీటి దోపిడి..!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • Uploaded Video:

అక్రమ మోటార్లతో మంచినీరు స్టోర్ చేసి కాలువల్లోకి వృథా
ఎలమంచిలి మండలంలోని మేజర్ పంచాయతీ అయిన ఏటికొప్పాక గ్రామంలో పంచాయతీ మంచినీటి సరఫరాను కొందరు వ్యక్తులు అక్రమంగా దుర్వినియోగం చేస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. పంచాయతీ కులాయిలకు మోటార్లు అమర్చి భారీగా నీటిని తమ ఇళ్లలో నిల్వ చేసుకుంటూ, అవసరానికి మించిన నీటిని కాలువల్లోకి వదిలేస్తున్న దృశ్యాలు గ్రామ ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తిస్తున్నాయి. ఒకవైపు గ్రామ ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతుండగా, మరోవైపు ప్రజల ప్రాణాధారమైన మంచినీరు ఇలా వృథా కావడం పట్ల మండిపడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి అక్రమ మోటార్లను తొలగించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. “ప్రజలకు అందాల్సిన నీరు కాలువల్లో కలవడం బాధాకరం” అంటూ గ్రామ పెద్దలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *