Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నిజామాబాద్

ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి చేతుల మీదుగా రూ.2,50,000 ఎల్ వో సి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి చేతుల మీదుగా రూ.2,50,000 ఎల్ వో సి

వార్త ముఖ్యాంశాలు

  • పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్న బాధితుడికి రూ.2.25 లక్షల LOC మంజూరు చేయించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి వేల్పూర్ మండలం పడగల్ గ్రామానికి చెందిన మాడవేడి బాలకుమార్ పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతూ చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చేరారు.
  • ఈ విషయం స్థానిక బీఆర్ఎస్ నాయకులు మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.
  • దీనిపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, బాధితుడి వైద్య చికిత్స కోసం రూ.2,25,000 విలువైన ఎల్‌ఓసీ (Letter of Credit) మంజూరు చేయించారు.

పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్న బాధితుడికి రూ.2.25 లక్షల LOC మంజూరు చేయించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి

వేల్పూర్ మండలం పడగల్ గ్రామానికి చెందిన మాడవేడి బాలకుమార్ పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతూ చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చేరారు. ఈ విషయం స్థానిక బీఆర్ఎస్ నాయకులు మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.

దీనిపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, బాధితుడి వైద్య చికిత్స కోసం రూ.2,25,000 విలువైన ఎల్‌ఓసీ (Letter of Credit) మంజూరు చేయించారు. ఈ రోజు హైదరాబాద్‌లోని తన నివాసంలో బాధిత కుటుంబ సభ్యులకు ఎల్‌ఓసీ కాపీని అందజేశారు.

ఈ సందర్భంగా మాడవేడి బాలకుమార్ కుటుంబ సభ్యులు తమ క్లిష్ట సమయంలో అండగా నిలిచి, వెంటనే స్పందించి చికిత్సకు అవసరమైన ఆర్థిక సహాయం అందించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *