వార్త ముఖ్యాంశాలు
- గ్రామపంచాయతీ రెండవ సాధారణ ఎన్నికలు–2026 ఫేజ్–III నిర్వహణలో భాగంగా అరకులోయ మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం రిటర్నింగ్ అధికారులు (స్టేజ్–I), సహాయ రిటర్నింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
- ఈ సందర్భంగా ఎన్నికల విధివిధానాలు, పాటించాల్సిన నిబంధనలు, అధికారుల బాధ్యతలు, పోలింగ్ ప్రక్రియపై అవగాహన కల్పించారు.
- ఎన్నికలను పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు.
గ్రామపంచాయతీ రెండవ సాధారణ ఎన్నికలు–2026 ఫేజ్–III నిర్వహణలో భాగంగా అరకులోయ మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం రిటర్నింగ్ అధికారులు (స్టేజ్–I), సహాయ రిటర్నింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల విధివిధానాలు, పాటించాల్సిన నిబంధనలు, అధికారుల బాధ్యతలు, పోలింగ్ ప్రక్రియపై అవగాహన కల్పించారు. ఎన్నికలను పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. ఎన్నికల ప్రక్రియను నిష్పక్షపాతంగా, విజయవంతంగా పూర్తి చేసేందుకు అధికారులు పూర్తి అవగాహనతో తమ విధులను నిర్వర్తించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వీసం ప్రసాద్, తహసీల్దార్ గుంటూరు శ్రీధర్, ఎంఈవో ప్రధాని భారతి తదితర అధికారులు పాల్గొన్నారు.
వార్తా మూలాలు
- Punnami Reportingపత్రికా ప్రకటన