Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కడప

ఉపాధి నిధుల్లో మూడో వంతు పంచాయతీలే ఖర్చు చేయాలి: కేంద్రం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఉపాధి నిధుల్లో మూడో వంతు పంచాయతీలే ఖర్చు చేయాలి: కేంద్రం

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి న్యూస్(ఆగస్టు 11): వీబీ జీ రామ్ జీ స్కీమ్‌ (ఉపాధి హామీ పథకం) కింద మంజూరయ్యే నిధుల్లో కనీసం మూడో వంతును పంచాయతీ స్థాయిలోనే ఖర్చు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.
  • ఈ నిర్ణయంతో ఫీల్డ్‌ అసిస్టెంట్లు, ఇతర సిబ్బంది గౌరవ వేతనాల చెల్లింపులకు నిధుల కొరత ఉండదని కేంద్రం పేర్కొంది.
  • అలాగే పథకం మొత్తం వ్యయంలో పరిపాలనా ఖర్చులను గరిష్ఠంగా 9 శాతానికి పరిమితం చేసింది.

పున్నమి న్యూస్(ఆగస్టు 11): వీబీ జీ రామ్ జీ స్కీమ్‌ (ఉపాధి హామీ పథకం) కింద మంజూరయ్యే నిధుల్లో కనీసం మూడో వంతును పంచాయతీ స్థాయిలోనే ఖర్చు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ నిర్ణయంతో ఫీల్డ్‌ అసిస్టెంట్లు, ఇతర సిబ్బంది గౌరవ వేతనాల చెల్లింపులకు నిధుల కొరత ఉండదని కేంద్రం పేర్కొంది.

అలాగే పథకం మొత్తం వ్యయంలో పరిపాలనా ఖర్చులను గరిష్ఠంగా 9 శాతానికి పరిమితం చేసింది. శిక్షణ, అవగాహన కార్యక్రమాలు, తనిఖీలు తదితర అవసరాల కోసం ఈ పరిమితికి మించి ఖర్చు చేస్తే, అదనపు భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *