Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఖమ్మం

ఉద్యోగ విరమణ అధికారులకు ఘన సన్మానం చేసిన పోలీస్ కమిషనర్ సునీల్ దత్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • ఖమ్మం, జూన్ (పువ్వాడ నాగేంద్ర కుమార్, పున్నమి జిల్లా రిపోర్టర్) ఖమ్మం పోలీస్ కమిషనరేట్‌లో మంగళవారం ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులకు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఘనంగా సన్మానం చేశారు.
  • పూలమాలలు, శాలువాలు కప్పి జ్ఞాపికలను అందజేసి వారి సేవలను కొనియాడారు.
  • ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, సుదీర్ఘ కాలం పాటు వివిధ విభాగాల్లో బాధ్యతాయుతంగా విధులు నిర్వహించి పోలీస్ శాఖకు విశిష్ట సేవలు అందించిన అధికారులను అభినందించారు.

ఖమ్మం, జూన్
(పువ్వాడ నాగేంద్ర కుమార్, పున్నమి జిల్లా రిపోర్టర్)

ఖమ్మం పోలీస్ కమిషనరేట్‌లో మంగళవారం ఉద్యోగ విరమణ పొందిన పోలీస్ అధికారులకు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఘనంగా సన్మానం చేశారు. పూలమాలలు, శాలువాలు కప్పి జ్ఞాపికలను అందజేసి వారి సేవలను కొనియాడారు.

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, సుదీర్ఘ కాలం పాటు వివిధ విభాగాల్లో బాధ్యతాయుతంగా విధులు నిర్వహించి పోలీస్ శాఖకు విశిష్ట సేవలు అందించిన అధికారులను అభినందించారు. విధి నిర్వహణలో వారికి అండగా నిలిచిన కుటుంబ సభ్యుల సేవలను కూడా ప్రత్యేకంగా ప్రశంసించారు. ఉద్యోగ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో ఆనందంగా, ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవితం గడపాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా ఉద్యోగ విరమణ పొందిన అధికారులు **కె. సుబ్బారావు (ఎస్‌ఐ), సీహెచ్.వి. లక్ష్మణ్ రావు (ఆర్‌ఎస్‌ఐ), జి.వి. సుబ్బారావు (ఏఆర్‌ఎస్‌ఐ), కె. కృష్ణయ్య (ఆర్‌ఎస్‌ఐ), బి. కృష్ణారావు (ఏఆర్‌ఎస్‌ఐ), రామ్ ప్రకాష్ రావు (ఏఆర్‌ఎస్‌ఐ), కె. శ్రీనివాసాచారి (ఏఎస్‌ఐ), సీహెచ్. వెంకటేశ్వరరావు (ఏఎస్‌ఐ), ఎస్‌కే అబ్దుల్ హమీద్ (ఏఎస్‌ఐ), ఎం.వి. సత్యనారాయణ (హెడ్ కానిస్టేబుల్), వి. వెంకటేశ్వర్లు (హెడ్ కానిస్టేబుల్), వి. శ్రీనివాసరావు (హెడ్ కానిస్టేబుల్), ఎస్‌కే లాల్ సాహెబ్, కె. బుల్లయ్య (హెడ్ కానిస్టేబుల్)**లను సత్కరించారు.

కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ బొజ్జ రామానుజం, సీసీఆర్‌బీ ఏసీపీ సాంబరాజు, ఏఆర్ ఏసీపీ నర్సయ్య, సీఐ సర్వయ్య, ఆర్‌ఐలు కామరాజు, నాగుల్ మీరా, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *