పున్నమి ప్రతినిధి అక్టోబరు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన దొమ్మాటి కిషన్ ఉపాధి కోసం గల్ఫ్ వెళ్ళేందుకు ఏజెంట్ శ్రీనివాసు ఆశ్రయించగా రష్యా లో ఉద్యోగం పేరుతో నమ్మించి రూ. 2.50 లక్షల వసూలు చేసి టూరిస్ట్ వీసాపై రష్యా కు పంపారు అక్కడ వీసా గడువు ముగియడంతో రష్యా సైన్యంలో చేర్పించారని భర్త చెప్పినట్లు కిషన్ భార్య రక్షిత ఫిర్యాదు చేసినట్లు ఎల్లారెడ్డిపేట ఎస్సై రమేష్ తెలిపారు
