వార్త ముఖ్యాంశాలు
- ఉదయగిరి అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ (AMC) డైరెక్టర్లుగా ఎంపికైన ఏ.
- చాందిని, పి.
- ధనలక్ష్మి ని ఉదయగిరి నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు ఘనంగా అభినందించారు.
ఉదయగిరి అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ (AMC) డైరెక్టర్లుగా ఎంపికైన ఏ. చాందిని, పి. ధనలక్ష్మి ని ఉదయగిరి నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు ఘనంగా అభినందించారు.
ఈ సందర్భంగా అవకాశం కల్పించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే జనసేన నాయకులకు పేరు పేరున కృతజ్ఞతలు వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు, నియోజకవర్గ నాయకులు రాము, రవీంద్ర, వెంకట్, రవి, ఆకుల వెంకటేశ్వర్లు, బండ్ల హరికృష్ణ, మాధవ్, గంగిశెట్టి సురేష్ తదితరులు పాల్గొన్నారు.