వార్త ముఖ్యాంశాలు
- పున్నమి న్యూస్ బోగోలు మండలం రిపోర్టర్ గోపాలకృష్ణారెడ్డి కావలి: ఎన్నికల డిక్లరేషన్ వ్యవహారాన్ని ప్రశ్నించినందుకే విలేకరి సుబ్బారావుపై దాడికి పాల్పడినట్లు జర్నలిస్టులు ఆరోపించారు.
- ఈ ఘటనను కావలి జర్నలిస్టులు తీవ్రంగా ఖండించారు.
- ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతున్న సుబ్బారావును పరామర్శించి, ఆయనకు సంఘీభావం తెలిపారు.
పున్నమి న్యూస్ బోగోలు మండలం రిపోర్టర్ గోపాలకృష్ణారెడ్డి
కావలి: ఎన్నికల డిక్లరేషన్ వ్యవహారాన్ని ప్రశ్నించినందుకే విలేకరి సుబ్బారావుపై దాడికి పాల్పడినట్లు జర్నలిస్టులు ఆరోపించారు. ఈ ఘటనను కావలి జర్నలిస్టులు తీవ్రంగా ఖండించారు. ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతున్న సుబ్బారావును పరామర్శించి, ఆయనకు సంఘీభావం తెలిపారు.
ఎన్నికల్లో 126 ఓట్లు సాధించిన అభ్యర్థికి డిక్లరేషన్ ఇవ్వకపోవడంపై ప్రశ్నించినందుకే కక్ష పెంచుకుని సుబ్బారావుపై దాడి చేసినట్లు జర్నలిస్టులు పేర్కొన్నారు. గతంలోనూ దాడి జరిగే అవకాశం ఉందని డీఎస్పీ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.
జర్నలిస్టులపై దాడులకు కఠిన చట్టాలు అమలు చేయాలి
ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తూ, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టులపై దాడులు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని జర్నలిస్టులు పేర్కొన్నారు. విధి నిర్వహణలో ఉన్న విలేకరులపై దాడులు, బెదిరింపులకు పాల్పడే వారిపై భారతీయ న్యాయ సంహిత (BNS)–2023లోని సంబంధిత సెక్షన్లు 115, 117, 126, 127, 131, 351 ప్రకారం నేర స్వభావాన్ని బట్టి కేసులు నమోదు చేయాలని కోరారు.
విలేకరిపై దాడికి పాల్పడిన వారిని గుర్తించి, సమగ్ర విచారణ జరిపి, చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని పోలీసు అధికారులను జర్నలిస్టులు డిమాండ్ చేశారు. జర్నలిస్టుల భద్రతకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. బాధిత విలేకరికి న్యాయం జరిగే వరకు జర్నలిస్టులంతా అండగా ఉంటామని స్పష్టం చేశారు.
వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్