Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉదయగిరి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని వినతి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ఉదయగిరి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని వినతి

వార్త ముఖ్యాంశాలు

  • ఉదయగిరి నియోజకవర్గంలోని ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా అక్రిడిటేషన్‌ కలిగిన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ మీడియా ఫెడరేషన్‌ ప్రతినిధులు ఎమ్మెల్యే కాకర్ల సురేష్‌కు వినతిపత్రం అందజేశారు.
  • మంగళవారం నర్రవాడలోని శ్రీ వెంగమాంబ పేరంటాలమ్మ దేవస్థానం అతిథి గృహంలో ఈ కార్యక్రమం జరిగింది.
  • ఆంధ్రప్రదేశ్‌ మీడియా ఫెడరేషన్‌ జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున, నియోజకవర్గ అధ్యక్షుడు లెక్కమనేని రాజేష్‌ ఆధ్వర్యంలో జర్నలిస్టులు ఎమ్మెల్యేను కలిసి తమ సమస్యను వివరించారు.

ఉదయగిరి నియోజకవర్గంలోని ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా అక్రిడిటేషన్‌ కలిగిన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ మీడియా ఫెడరేషన్‌ ప్రతినిధులు ఎమ్మెల్యే కాకర్ల సురేష్‌కు వినతిపత్రం అందజేశారు. మంగళవారం నర్రవాడలోని శ్రీ వెంగమాంబ పేరంటాలమ్మ దేవస్థానం అతిథి గృహంలో ఈ కార్యక్రమం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌ మీడియా ఫెడరేషన్‌ జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున, నియోజకవర్గ అధ్యక్షుడు లెక్కమనేని రాజేష్‌ ఆధ్వర్యంలో జర్నలిస్టులు ఎమ్మెల్యేను కలిసి తమ సమస్యను వివరించారు. గత కొన్నేళ్లుగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పంపిణీ హామీలకే పరిమితమైందని తెలిపారు. జర్నలిజాన్ని వృత్తిగా చేసుకుని జీవిస్తున్న విలేకరులకు ప్రభుత్వం తరఫున అధికారికంగా ఇళ్ల స్థలాలు మంజూరు చేసి ఆదుకోవాలని వినతిపత్రంలో కోరారు. ఎమ్మెల్యే కాకర్ల సురేష్‌ సమస్యను పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *