వార్త ముఖ్యాంశాలు
- కలిగిరి: అనారోగ్య సమస్యలతో వైద్య చికిత్సకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కలిగిరి మండలం జిర్రావారిపాలెం గ్రామానికి చెందిన ఇర్ల లక్ష్మమ్మ, వీర్నకల్లు ఎస్సీ కాలనీకి చెందిన బక్క పెద్దయ్యలకు ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అండగా నిలిచారు.
- స్థానిక నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే, కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇద్దరికీ వైద్య ఖర్చుల నిమిత్తం ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించారు.
- ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరుపేదల కష్టాల్లో భాగస్వామ్యం కావడం తన బాధ్యతగా భావిస్తున్నానన్నారు.
కలిగిరి: అనారోగ్య సమస్యలతో వైద్య చికిత్సకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కలిగిరి మండలం జిర్రావారిపాలెం గ్రామానికి చెందిన ఇర్ల లక్ష్మమ్మ, వీర్నకల్లు ఎస్సీ కాలనీకి చెందిన బక్క పెద్దయ్యలకు ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అండగా నిలిచారు. స్థానిక నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే, కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇద్దరికీ వైద్య ఖర్చుల నిమిత్తం ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరుపేదల కష్టాల్లో భాగస్వామ్యం కావడం తన బాధ్యతగా భావిస్తున్నానన్నారు. అవసరమైన సమయంలో అందించే సహాయం బాధిత కుటుంబాలకు భరోసా కలిగిస్తుందని తెలిపారు. పేదలకు అండగా ట్రస్ట్ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తుందని పేర్కొన్నారు.