Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉదయగిరిలో బీసీ హాస్టల్‌ను పునఃప్రారంభించాలి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • ఉదయగిరి నియోజకవర్గంలో బీసీ విద్యార్థుల కోసం గతంలో కొనసాగిన బీసీ హాస్టల్‌ను వెంటనే పునఃప్రారంభించాలని వరికుంటపాడు మాజీ సర్పంచ్ కొండెపోగు దిలీప్ కుమార్ కోరారు.
  • హాస్టల్ మూసివేయడంతో పేద, వెనుకబడిన తరగతులకు చెందిన విద్యార్థులు వసతి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
  • దూర ప్రాంతాల నుంచి విద్యనభ్యసించేందుకు వచ్చే విద్యార్థులకు హాస్టల్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.

ఉదయగిరి నియోజకవర్గంలో బీసీ విద్యార్థుల కోసం గతంలో కొనసాగిన బీసీ హాస్టల్‌ను వెంటనే పునఃప్రారంభించాలని వరికుంటపాడు మాజీ సర్పంచ్ కొండెపోగు దిలీప్ కుమార్ కోరారు. హాస్టల్ మూసివేయడంతో పేద, వెనుకబడిన తరగతులకు చెందిన విద్యార్థులు వసతి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. దూర ప్రాంతాల నుంచి విద్యనభ్యసించేందుకు వచ్చే విద్యార్థులకు హాస్టల్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించి అవసరమైన మౌలిక వసతులు కల్పించి హాస్టల్‌ను తిరిగి ప్రారంభించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దీనివల్ల విద్యార్థులకు వసతి సౌకర్యం లభించడంతో పాటు చదువుపై మరింత దృష్టి సారించే అవకాశం ఉంటుందని దిలీప్ కుమార్ పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *