Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నిర్మల్

ఇళ్లు, ఆలయాల్లో చోరీలుఐదుగురు అరెస్టు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఇళ్లు, ఆలయాల్లో చోరీలుఐదుగురు అరెస్టు

ఆగస్టు 22 పున్నమి ప్రతినిధి : నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో ఇళ్లు, ఆలయాల్లో వరుస చోరీలకు పాల్పడిన ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. రూరల్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో భైంసా ఏఎస్పీ సాయి కిరణ్ ఈ వివరాలను వెల్లడించారు. నిందితుల వివరాలు ముధోల్ మండలం ఎడ్బిడ్, బ్రహ్మణ్గావ్ గ్రామాలకు చెందిన పెద్ద సాయన్న, భూమేష్, గంగన్నలతో పాటు నందిపేట్కు చెందిన పండరి, లోకేశ్వరం మండలానికి చెందిన కుమార్ ఈ చోరీలకు పాల్పడినట్లు ఏఎస్పీ తెలిపారు. వీరు గత రెండు నెలల కాలంలో లోకేశ్వరం, భైంసా మండలాల్లోని పలు గ్రామాల్లో మొత్తం 10 చోరీలకు పాల్పడినట్లు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న సొత్తు నిందితుల వద్ద నుంచి రూ.5 వేల నగదు, మూడు సెల్ఫోన్లు, రెండు ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల అభినందన అరెస్ట్ అయిన నిందితులను రిమాండ్కు తరలిస్తున్నట్లు ఏఎస్పీ సాయి కిరణ్ తెలిపారు. చోరీ కేసులను ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన పోలీసు సిబ్బందిని ఆయన అభినందించారు.

ఇళ్లు, ఆలయాల్లో చోరీలుఐదుగురు అరెస్టు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *