వార్త ముఖ్యాంశాలు
- ములకలపల్లి: మండలంలోని మూకమామిడి గ్రామపంచాయతీ పరిధి గుట్టగూడెంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద నిర్మించిన నూతన ఇంటి గృహప్రవేశ కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది.
- లబ్ధిదారులు కాకా శ్రీదేవి–రమేష్ దంపతుల నూతన గృహాన్ని సర్పంచ్ కోర్సా ఆదిలక్ష్మి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
- అనంతరం కొబ్బరికాయ కొట్టి దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.
ములకలపల్లి: మండలంలోని మూకమామిడి గ్రామపంచాయతీ పరిధి గుట్టగూడెంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద నిర్మించిన నూతన ఇంటి గృహప్రవేశ కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది. లబ్ధిదారులు కాకా శ్రీదేవి–రమేష్ దంపతుల నూతన గృహాన్ని సర్పంచ్ కోర్సా ఆదిలక్ష్మి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం కొబ్బరికాయ కొట్టి దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ పేదల సొంతింటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. మూకమామిడి పంచాయతీ పరిధిలోని అన్ని గ్రామాల్లో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యేలా కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో వార్డు సభ్యుడు కనితి చిన్న వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు అనంతుల సత్యనారాయణ, గ్రామ పెద్ద సవలం సత్యనారాయణ, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.