Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ASIFABAD

ఇందిరమ్మ ఇంటిపై విద్యుత్ వైర్ల ముప్పు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ఇందిరమ్మ ఇంటిపై విద్యుత్ వైర్ల ముప్పు

పిర్యాదు చేసి 10 రోజులు.. స్పందించని అధికారులు

ఆసిఫాబాద్ జిల్లా, సిర్పూర్ | అక్టోబర్ 4, 2026 | పున్నమి న్యూస్

సిర్పూర్ మండలం వెంకట్రావుపేట గ్రామానికి చెందిన మంజు బాయ్ ఇందిరమ్మ ఇంటి నిర్మాణం విద్యుత్ వైర్ల సమస్యతో నిలిచిపోయింది. ఇంటికి స్లాబ్ వేసే సమయంలో పైభాగంలో ఉన్న విద్యుత్ వైర్ల కారణంగా కరెంట్ షాక్ ప్రమాదం జరిగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో దాదాపు నెల రోజులుగా నిర్మాణ పనులు నిలిచిపోయాయి.

ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ వైర్లను తొలగించాలని అధికారులకు ఫిర్యాదు చేసి 10 రోజులు గడిచినా, ఇప్పటివరకు అధికారులు ఇంటి వద్దకు వచ్చి పరిస్థితిని పరిశీలించలేదని కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే ప్రమాదం జరిగిన నేపథ్యంలో మరోసారి ప్రమాదం జరగకముందే అధికారులు స్పందించాలని కోరుతున్నారు.

వర్షాల కారణంగా ఇంటి నిర్మాణానికి తెచ్చిన సిమెంట్, ఇసుక తదితర సామగ్రి దెబ్బతింటోందని కుటుంబ సభ్యులు తెలిపారు. మంజు బాయ్ ఫిర్యాదును అధికారులు వెంటనే పరిశీలించి, విద్యుత్ వైర్ల సమస్యను పరిష్కరించి, సురక్షితంగా ఇంటి నిర్మాణం కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఇప్పటికే ప్రమాదం జరిగింది.. మరి అధికారులు స్పందించేది ఎప్పుడు?

ఇందిరమ్మ ఇంటిపై విద్యుత్ వైర్ల ముప్పు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *