Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కడప

ఇంటింటి సర్వేనా? ‘ఇక్కడికే రండి’ సర్వేనా -ఎన్. గొల్లపల్లె లో నిబంధనలకు తిలోదకా తీరు నానా అవస్థలు పడుతున్న ప్రజలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఇంటింటి సర్వేనా? ‘ఇక్కడికే రండి’ సర్వేనా -ఎన్. గొల్లపల్లె లో నిబంధనలకు తిలోదకా తీరు నానా అవస్థలు పడుతున్న ప్రజలు

*ఇంటింటి సర్వేనా? ‘ఇక్కడికే రండి’ సర్వేనా*

*ఎన్. గొల్లపల్లె లో నిబంధనలకు తిలోదకాలు ఇచ్చిన అధికారులు*

*ఇళ్ల వద్దకు వెళ్లకుండా ఒకే చోట కూర్చుని మమ అనిపిస్తున్న తీరు*

*నానా అవస్థలు పడుతున్న ప్రజలు*

ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సర్ ఇంటింటి సర్వే’ క్షేత్రస్థాయిలో అబాసుపాలవుతోంది. అధికారులు ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజల వివరాలు, వారి సమస్యలను తెలుసుకోవాలనేది నిబంధన. కానీ, బ్రహ్మంగారిమఠం మండలం నాగిశెట్టిపల్లె పంచాయతీ పరిధిలోని ఎన్.గొల్లపల్లె గ్రామంలో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. సర్వే చేయాల్సిన అధికారులు నిబంధనలను గాలికొదిలేసి, ఒకే చోట కూర్చుని సర్వే ప్రక్రియను ముగించే ప్రయత్నం చేస్తుండటంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సర్వే కోసం వచ్చిన అధికారులు ఊరిలోని ప్రతి ఇంటికీ వెళ్లాల్సింది పోయి, గ్రామంలోని ఒక నిర్దిష్ట ప్రదేశంలో తిష్ట వేశారు.

గ్రామంలోని ప్రజలందరినీ తాము కూర్చున్న చోటుకే రావాలంటూ పురమాయించారు. దీంతో పనులన్నీ వదులుకుని గ్రామస్థులు, వృద్ధులు, మహిళలు ఆ ప్రదేశానికి చేరుకోవాల్సి వస్తోంది. గంటల తరబడి పడిగాపులు కాస్తూ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

*నిబంధనలు ఏం చెప్తున్నాయి? క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోంది?*
ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం.. సర్వే సిబ్బంది ప్రతి ఇంటి గుమ్మం తొక్కాలి. ఆ కుటుంబ జీవన ప్రమాణాలు, ఇతర వివరాలను ప్రత్యక్షంగా పరిశీలించి నమోదు చేయాలి. కానీ, ఎన్.గొల్లపల్లెలో మాత్రం అధికారులు తమ శ్రమను తగ్గించుకోవడానికి, కేవలం ఒకే చోట కూర్చుని, వచ్చిన వారి వద్ద నుంచి అరకొర సమాచారంతో ఫారాలు పూర్తి చేస్తూ ‘మమ’ అనిపిస్తున్నారు. ఇలా చేయడం వల్ల సర్వే యొక్క అసలు ఉద్దేశమే దెబ్బతింటుందని, నిజమైన లబ్ధిదారులు, బాధితుల వివరాలు సరిగ్గా నమోదు కావని సామాజిక విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఉన్నతాధికారులు స్పందించాలి:

ఒకవైపు ప్రభుత్వం సర్వేను పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశిస్తుంటే, క్షేత్రస్థాయిలో కొందరు అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చేలా ఉంది. నాగిశెట్టిపల్లె పంచాయతీలో జరుగుతున్న ఈ తంతుపై జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకుని, నిబంధనల ప్రకారం ప్రతి ఇంటికీ వెళ్లి సర్వే నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతున్నారు.

దీనిపై బిఎల్వో (BLO), సర్వే అధికారులను వివరణ కోరగా.. ఒకే చోట కూర్చుని సర్వే చేస్తే తప్పేమిటని ప్రశ్నించారు. ఇంటింటికీ వెళ్లినప్పుడు ప్రజలు సరిగా స్పందించడం లేదని, ఇళ్లకు తాళాలు ఉండటం లేదా కొత్తగా వచ్చిన కోడళ్లు ఉన్న ఇంట్లో పెద్దల వివరాలు తెలియడం లేదని పేర్కొన్నారు. అదే పదిమంది ఒకచోట ఉంటే ఒకరినొకరు అడిగి ఓటర్ల పూర్తి వివరాలు స్పష్టంగా చెబుతున్నారని, ఇక్కడికి రాని వారి ఇళ్లకు తర్వాత వెళ్తామని సర్వే సిబ్బంది సమర్థించుకున్నారు.

అయితే, సమాచార సేకరణ నెపంతో వృద్ధులను, మహిళలను ఎండలో తిప్పడం సరికాదని గ్రామస్థులు మండిపడుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి, నిబంధనల ప్రకారం ప్రతి ఇంటికీ వెళ్లి సర్వే జరిగేలా చూడాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇంటింటి సర్వేనా? ‘ఇక్కడికే రండి’ సర్వేనా -ఎన్. గొల్లపల్లె లో నిబంధనలకు తిలోదకా తీరు నానా అవస్థలు పడుతున్న ప్రజలు

ఇంటింటి సర్వేనా? ‘ఇక్కడికే రండి’ సర్వేనా -ఎన్. గొల్లపల్లె లో నిబంధనలకు తిలోదకా తీరు నానా అవస్థలు పడుతున్న ప్రజలు

ఇంటింటి సర్వేనా? ‘ఇక్కడికే రండి’ సర్వేనా -ఎన్. గొల్లపల్లె లో నిబంధనలకు తిలోదకా తీరు నానా అవస్థలు పడుతున్న ప్రజలు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *