Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఆలమూరు సబ్ రిజిస్టార్ పై ఏసీబీ దాడులు* *లంచం తీసుకుంటూ పట్టు పడ్డారు*

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఆలమూరు సబ్ రిజిస్టార్ పై ఏసీబీ దాడులు* *లంచం తీసుకుంటూ పట్టు పడ్డారు*

వార్త ముఖ్యాంశాలు

  • డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు సబ్ రిజిస్టర్ కోన విమల సరోజని కుమారి ఓ రైతు నుంచి డబ్బులు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.
  • సోమవారం సాయంత్రం సబ్ రిజిస్టర్ తన కారు డ్రైవర్ దాసరి దుర్గా ప్రసాద్ ద్వారా రూ.28వేలు లంచం తీసుకుంటుండగా రాజమహేంద్రవరం ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు.
  • రాత్రి వరకు ఈ దాడులు కొనసాగాయి..

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు సబ్ రిజిస్టర్ కోన విమల సరోజని కుమారి ఓ రైతు నుంచి డబ్బులు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. సోమవారం సాయంత్రం సబ్ రిజిస్టర్ తన కారు డ్రైవర్ దాసరి దుర్గా ప్రసాద్ ద్వారా రూ.28వేలు లంచం తీసుకుంటుండగా రాజమహేంద్రవరం ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. రాత్రి వరకు ఈ దాడులు కొనసాగాయి.. ఆలమూరు మండలం బడుగువానిలంక గ్రామానికి చెందిన గట్టి సుబ్రహ్మణ్యం కు చెందిన ఎకరా 36 సెంట్లు భూమిని తన కుమారుడుకి రిజిస్ట్రేషన్‌ చేయడానికి రూ. 50 వేలు లంచం అడిగారని చివరకు రూ.28 వేలకు ఒప్పుకున్నారని రైతు పిర్యాదు చేయడంతో ఏసీబి అధికారులు వల పన్ని పట్టుకున్నారు. అంతేగాక మరో 35 వేల రూపాయలు అనధికారికంగా ఉండటాన్ని దాడుల్లో పట్టుకున్నారు. ఆ నగదును సీజ్ చేయడంతో పాటు సబ్ రిజిస్టర్, కార్ డ్రైవర్‌ను అదుపులో తీసుకున్నట్లు ఎసిబీ డి.ఎస్.పి కిషోర్ కుమార్ తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *