Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
విశాఖపట్నం

ఆర్టీసీ బస్సు పూర్తిగా దగ్ధం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ఆర్టీసీ బస్సు పూర్తిగా దగ్ధం

వార్త ముఖ్యాంశాలు

  • విశాఖ నగరంలో శనివారం తెల్లవారుజామున ఒక భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది నెల్లూరు నుంచి ప్రయాణికులతో విశాఖ పట్నం చేరుకున్న ఒక ఏపీఎస్ఆర్టీసీ (APSRTC) బస్సు వాల్తేరు డిపో సమీపంలో నిలిపి ఉంచగా ఆకస్మాత్తుగా మంటలు అంటుకుని నిమిషాల వ్యవధిలోనే పూర్తిగా దగ్ధ మైంది నెల్లూరు నుంచి…
  • బస్సు ఖాళీగా ఉన్న సమ యంలోనే ఈ ప్రమాదం జరగడంతో ఒక పెద్ద ముప్పు తప్పింది నిమిషాల వ్యవధిలోనే మంటలు బస్సు మొత్తానికి విస్తరించి వాహనం పూర్తిగా దగ్ధం అయ్యింది బస్సు తగల బడుతున్న విషయాన్ని గమనించిన స్థానికులు సిబ్బంది వెంటనే పోలీసుల కు,అగ్నిమాపక శాఖకు సమాచారం…

విశాఖ నగరంలో శనివారం తెల్లవారుజామున ఒక భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది నెల్లూరు నుంచి ప్రయాణికులతో విశాఖ పట్నం చేరుకున్న ఒక ఏపీఎస్ఆర్టీసీ (APSRTC) బస్సు వాల్తేరు డిపో సమీపంలో నిలిపి ఉంచగా ఆకస్మాత్తుగా మంటలు అంటుకుని నిమిషాల వ్యవధిలోనే పూర్తిగా దగ్ధ మైంది నెల్లూరు నుంచి సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఈ బస్సు విశాఖకు చేరు కుంది అనంతరం వాల్తేరు డిపో వెలుపల బస్సును నిలిపి ఉంచారు అయితే, శనివారం తెల్లవారు జామున ఒక్కసారిగా బస్సు ఇంజిన్ భాగం నుండి దట్టమైన పొగలు, మంటలు వ్యాపించాయి. బస్సు ఖాళీగా ఉన్న సమ యంలోనే ఈ ప్రమాదం జరగడంతో ఒక పెద్ద ముప్పు తప్పింది నిమిషాల వ్యవధిలోనే మంటలు బస్సు మొత్తానికి విస్తరించి వాహనం పూర్తిగా దగ్ధం అయ్యింది బస్సు తగల బడుతున్న విషయాన్ని గమనించిన స్థానికులు సిబ్బంది వెంటనే పోలీసుల కు,అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు ఘటనా స్థలానికి చేరు కున్న ఫైర్ సిబ్బంది ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపు చేశారు ఆర్టీసీ ఉన్నతాధి కారులు,పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీ లించారు బస్సులో మంటలు చెలరేగడానికి షార్ట్ సర్క్యూట్ కారణమా లేదా మరేదైనా సాంకేతిక లోపమా అనే కోణంలో పోలీసులు ఆర్టీసీ సాంకేతిక విభాగం అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఈ ప్రమాదం లో ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం తో అధికారులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *