వార్త ముఖ్యాంశాలు
- చదువుల తల్లి శ్రీ సరస్వతీ దేవికి శతకోటి వందనాలు -- ఆదివారం పట్టణ పురవీధుల్లో గోపాల కాలువలు మంథని, అక్టోబర్ 17: దేవీ నవరాత్రుల సందర్భంగా ఆరవ రోజు శనివారం మంథని పట్టణంలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని శ్రీ సరస్వతీ దేవి రూపంలో దేదీప్యమానంగా అలంకరించారు.
- ఈ అలంకరణలో భక్తులు భక్తిశ్రద్ధలతో ఆరాధించారు.
- ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు మంథని పట్టణంలోని పురవీధుల గుండా అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగిస్తారు.
చదువుల తల్లి శ్రీ సరస్వతీ దేవికి శతకోటి వందనాలు — ఆదివారం పట్టణ పురవీధుల్లో గోపాల కాలువలు
మంథని, అక్టోబర్ 17:
దేవీ నవరాత్రుల సందర్భంగా ఆరవ రోజు శనివారం మంథని పట్టణంలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని శ్రీ సరస్వతీ దేవి రూపంలో దేదీప్యమానంగా అలంకరించారు. ఈ అలంకరణలో భక్తులు భక్తిశ్రద్ధలతో ఆరాధించారు. ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు మంథని పట్టణంలోని పురవీధుల గుండా అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగిస్తారు. వాడవాడల్లో ఉట్టి కట్టి గోపాల కాలువలు కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు మారుపాక ప్రశాంత్, ఆలయ కమిటీ అధ్యక్షులు కనుకుంట్ల బాబు తెలిపారు. సకల విద్యలకు, జ్ఞానానికి, సంగీతానికి, సాహిత్యానికి, కళలకు అధిదేవత శ్రీ సరస్వతీ మాత. తెల్లని వస్త్రాలు ధరించి, కమలాసనంపై ఆసీనురాలై, చేతిలో వీణను ధరించి దర్శనమిచ్చే అమ్మవారి రూపం ప్రశాంతతకు, పవిత్రతకు, జ్ఞానానికి ప్రతీక. మనిషికి సంపద కంటే గొప్పది విద్య. అధికారానికి మించినది జ్ఞానం. అందానికి మించినది మంచి సంస్కారం. ఈ మూడింటినీ ప్రసాదించే కరుణామయి శ్రీ సరస్వతీ మాత. అమ్మవారి అనుగ్రహంతో చిన్నారులకు విద్యాబుద్ధులు, విద్యార్థులకు ఏకాగ్రత, యువతకు మంచి భవిష్యత్తు, ప్రతి కుటుంబానికి సుఖశాంతులు సిద్ధిస్తాయి. అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది.