Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
పెద్దపల్లి

ఆధ్యాత్మిక జీవనమే పరమానందం: మంథని డివిజన్ మీడియా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కోడారి మల్లేష్ యాదవ్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ఆధ్యాత్మిక జీవనమే పరమానందం: మంథని డివిజన్ మీడియా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కోడారి మల్లేష్ యాదవ్

వార్త ముఖ్యాంశాలు

  • పవిత్ర శ్రావణ మాసం సందర్భంగా మంథని డివిజన్ క్లబ్ దైవ దర్శనాలు మంథని, ఆగస్టు 25: మంథని పట్టణ డివిజన్ ప్రెస్ క్లబ్ ప్రతినిధులు పవిత్ర శ్రావణ మాసంలోని మంగళవారాన్ని పురస్కరించుకుని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని, కొండగట్టు శ్రీ అంజనేయ స్వామిని దర్శించుకున్నారు.
  • అత్యంత భక్తిశ్రద్ధలతో స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి, తమ మొక్కులు చెల్లించుకున్నారు.
  • ప్రెస్ క్లబ్ సంక్షేమం, అభివృద్ధే లక్ష్యం: ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కోడారి మల్లేష్ యాదవ్ మాట్లాడుతూ...

పవిత్ర శ్రావణ మాసం సందర్భంగా మంథని డివిజన్ క్లబ్ దైవ దర్శనాలు

మంథని, ఆగస్టు 25:
మంథని పట్టణ డివిజన్ ప్రెస్ క్లబ్ ప్రతినిధులు పవిత్ర శ్రావణ మాసంలోని మంగళవారాన్ని పురస్కరించుకుని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని, కొండగట్టు శ్రీ అంజనేయ స్వామిని దర్శించుకున్నారు. అత్యంత భక్తిశ్రద్ధలతో స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి, తమ మొక్కులు చెల్లించుకున్నారు.

ప్రెస్ క్లబ్ సంక్షేమం, అభివృద్ధే లక్ష్యం:

ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కోడారి మల్లేష్ యాదవ్ మాట్లాడుతూ… మనిషికి ఆధ్యాత్మిక జీవనమే పరమానందం అని తెలిపారు. డివిజన్ ప్రెస్ క్లబ్ రోజురోజుకూ దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. క్లబ్‌లోని సభ్యులందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, సమాజ శ్రేయస్సు కోసం పాత్రికేయులు చేపడుతున్న కార్యక్రమాలు విజయవంతం కావాలని స్వామివార్ల పాదాల వద్ద ప్రార్థించినట్లు తెలిపారు. అలాగే క్లబ్ ప్రధాన కార్యదర్శి మహావాది సతీష్ కుమార్ మాట్లాడుతూ ఆధ్యాత్మిక వాతావరణంలో సాగిన ఈ దైవదర్శనం సభ్యులకు తీవ్ర భక్తి పారవశ్యాన్ని, నూతనోత్తేజాన్ని అందించిందనీ , క్లబ్ సభ్యులందరికీ, ప్రజలకు శుభం జరగాలని కోరుకున్నారు.

ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కొడారి మల్లేష్ యాదవ్, ప్రధాన కార్యదర్శి మహవాది సతీష్ కుమార్ , మేడగోని రాజమౌళి గౌడ్, ఏగోలపు సంతోష్ గౌడ్, కాచర్ల శంకర్, ఎండి సుభాన్, రామడుగు సాయి శ్రీనివాస్, మాదేశి శ్రావణ్ కుమార్ , మంథని లక్ష్మణ్, కాశీపేట శ్రీకాంత్, నాంపల్లి శ్రీనివాస్, కావేటి సమ్మయ్య, తదితరులు పాల్గొన్నారు. పూజా కార్యక్రమాల అనంతరం స్వామివార్ల తీర్థప్రసాదాలు స్వీకరించిన సభ్యులు, ప్రెస్ క్లబ్ భవిష్యత్ కార్యక్రమాలపై కూడా పలు అంశాలను చర్చించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *