వార్త ముఖ్యాంశాలు
- విశాఖపట్నం జిల్లా, (పున్నమి ప్రతినిధి) నవంబర్ 19:: కేవలం 7 నెలల్లోనే రూ.120.50 కోట్ల ఆదాయం..
- గత ఏడాది వార్షిక ఆదాయానికి చేరువ!
- సింహాచలం: రాష్ట్రంలో అత్యధిక ఆదాయం సమకూర్చుకుంటున్న టాప్-5 దేవాలయాల్లో సింహాచలం దేవస్థానం చోటు సంపాదించింది.
విశాఖపట్నం జిల్లా, (పున్నమి ప్రతినిధి) నవంబర్ 19::
కేవలం 7 నెలల్లోనే రూ.120.50 కోట్ల ఆదాయం.. గత ఏడాది వార్షిక ఆదాయానికి చేరువ!
సింహాచలం: రాష్ట్రంలో అత్యధిక ఆదాయం సమకూర్చుకుంటున్న టాప్-5 దేవాలయాల్లో సింహాచలం దేవస్థానం చోటు సంపాదించింది. 2026 ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు కేవలం ఏడు నెలల వ్యవధిలోనే వివిధ విభాగాల ద్వారా ఏకంగా రూ.120.50 కోట్ల ఆదాయం సమకూరడం విశేషం.
హుండీ కానుకలు, తలనీలాలు, దర్శనాలు, రవాణా తదితర విభాగాల ద్వారా దేవస్థానానికి ఈ భారీ ఆదాయం లభించింది. మరో విశేషమేమిటంటే.. గత ఏడాది పూర్తి ఆర్థిక సంవత్సరంలో వచ్చిన మొత్తం ఆదాయానికి కేవలం రూ.5.96 కోట్లు మాత్రమే తక్కువగా, ఈ ఏడాది ఏడు నెలల్లోనే ఆదాయం సమకూరింది.
భక్తుల ఆదరణ, స్వామివారి దర్శనానికి పెరుగుతున్న భక్తుల రాకతో సింహాచలం దేవస్థానం ఆదాయంలో దూసుకెళ్తోంది.
వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్