వార్త ముఖ్యాంశాలు
- టీడీపీ సభ్యుల నిర్ణయంతో అసంతృప్తి!
- విశాఖపట్నం జిల్లా,ఆనందపురం (పున్నమి ప్రతినిధి): నవంబర్ 19: ఆనందపురం ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన వైస్ ఎంపీపీ ఎన్నిక రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
- వైస్ ఎంపీపీ పదవిని జనసేనకు కేటాయిస్తామని నమ్మించి, చివరకు టీడీపీ సభ్యులు తమ పార్టీకి చెందిన అభ్యర్థిని ఎన్నుకున్నారంటూ జనసేన వర్గాల నుంచి ఆరోపణలు వ్యక్తమయ్యాయి.
టీడీపీ సభ్యుల నిర్ణయంతో అసంతృప్తి!
విశాఖపట్నం జిల్లా,ఆనందపురం (పున్నమి ప్రతినిధి): నవంబర్ 19:
ఆనందపురం ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన వైస్ ఎంపీపీ ఎన్నిక రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. వైస్ ఎంపీపీ పదవిని జనసేనకు కేటాయిస్తామని నమ్మించి, చివరకు టీడీపీ సభ్యులు తమ పార్టీకి చెందిన అభ్యర్థిని ఎన్నుకున్నారంటూ జనసేన వర్గాల నుంచి ఆరోపణలు వ్యక్తమయ్యాయి.
వైస్ ఎంపీపీ పదవిని ఆశించిన జనసేన ఎంపీటీసీ సభ్యుడు తమ్మిన అప్పలరాజుకు ఈ పరిణామం నిరాశ కలిగించినట్లు తెలుస్తోంది. టీడీపీ ఎంపీటీసీ సభ్యులు ఆబోతు యమునను వైస్ ఎంపీపీగా ఎన్నుకోవడంతో అప్పలరాజు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.
ఎన్నిక ఫలితం వెలువడిన అనంతరం అసంతృప్తితో ఎంపీడీఓ కార్యాలయం నుంచి అప్పలరాజు బయటకు వెళ్లిపోయారు.
వైస్ ఎంపీపీ పదవి విషయంలో ముందుగా జరిగిన రాజకీయ చర్చలు, ఇచ్చినట్లు చెబుతున్న హామీలు, చివరి నిమిషంలో చోటుచేసుకున్న పరిణామాలు ఇప్పుడు ఆనందపురం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి.
హామీ ఒకరిది.. పదవి మరొకరికి! వైస్ ఎంపీపీ ఎన్నికతో ఆనందపురం రాజకీయాల్లో నెలకొన్న ఈ పరిణామాలు రానున్న రోజుల్లో ఎలాంటి మలుపు తిరుగుతాయో వేచి చూడాలి.
వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్