Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
News

ఆత్మకూరు జిల్లా ఆసుపత్రిలో యూఐపీ సెషన్ తనిఖీ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఆత్మకూరు జిల్లా ఆసుపత్రిలో యూఐపీ సెషన్ తనిఖీ

వార్త ముఖ్యాంశాలు

  • ఆత్మకూరు (హరికిరణ్, పున్నమి ప్రతినిధి): ఆత్మకూరు జిల్లా ఆసుపత్రి (డీహెచ్ ఆత్మకూరు)లో నిర్వహిస్తున్న యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ సెషన్‌ను హెచ్‌ఓ ఎస్.
  • సుధాకర్ బుధవారం తనిఖీ చేశారు.
  • ఈ సందర్భంగా వ్యాక్సిన్ల నిల్వ విధానం, ఐస్ ప్యాక్స్ నిర్వహణ, కోల్డ్ చైన్ వ్యవస్థ పనితీరును పరిశీలించి సంబంధిత సిబ్బందికి పలు సూచనలు చేశారు.

వ్యాక్సిన్ ప్రక్రియ, కోల్డ్ చైన్ నిర్వహణపై అధికారుల పరిశీలన

ఆత్మకూరు (హరికిరణ్, పున్నమి ప్రతినిధి): ఆత్మకూరు జిల్లా ఆసుపత్రి (డీహెచ్ ఆత్మకూరు)లో నిర్వహిస్తున్న యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ సెషన్‌ను హెచ్‌ఓ ఎస్. సుధాకర్ బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వ్యాక్సిన్ల నిల్వ విధానం, ఐస్ ప్యాక్స్ నిర్వహణ, కోల్డ్ చైన్ వ్యవస్థ పనితీరును పరిశీలించి సంబంధిత సిబ్బందికి పలు సూచనలు చేశారు.

ప్రస్తుతం ఎండల తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో చిన్నపిల్లలకు వ్యాక్సిన్ వేసిన వెంటనే ఎక్కువసేపు ఆసుపత్రి వద్ద ఉంచకుండా త్వరగా ఇళ్లకు పంపించాలని సిబ్బందికి సూచించారు. అలాగే ప్రతి చిన్నారి యొక్క ఇమ్యునైజేషన్ కార్డు లేదా మదర్ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్ కార్డులో వ్యాక్సిన్ తేదీలు, తదుపరి డోస్ వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా హెచ్‌పీవీ వ్యాక్సిన్‌పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న టీకాలను ప్రతి అర్హత కలిగిన వారు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బాలికల ఆరోగ్య రక్షణలో హెచ్‌పీవీ వ్యాక్సిన్ కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు.

అదేవిధంగా ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న సీజనల్ వ్యాధులైన డెంగ్యూ, మలేరియా, వడదెబ్బ (సన్ స్ట్రోక్) నివారణపై కూడా ప్రజలకు అవగాహన కల్పించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, నిల్వ నీటిని తొలగించడం, దోమల నివారణ చర్యలు చేపట్టడం మరియు ఎండల సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఎంపీహెచ్‌ఈఓ ఎస్. సుధాకర్, ఎంపీహెచ్‌ఏ జి. రవీంద్ర రెడ్డి, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *