Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

దసరా సెలవుల్లో పిల్లల భద్రతపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి: సీఐ గంగాధర్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
దసరా సెలవుల్లో పిల్లల భద్రతపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి: సీఐ గంగాధర్

వార్త ముఖ్యాంశాలు

  • ఆత్మకూరు, పున్నమి: దసరా సెలవుల నేపథ్యంలో తల్లిదండ్రులు పిల్లల భద్రత పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆత్మకూరు సీఐ గంగాధర్ సూచించారు.
  • సెలవుల సమయంలో పిల్లలు ఆడుకునేందుకు నీటి కుంటలు, బావుల వద్దకు వెళ్లే అవకాశం ఉన్నందున వారిని నిరంతరం గమనిస్తూ ఉండాలన్నారు.
  • ప్రమాదాలు జరిగే ప్రాంతాలకు పిల్లలు వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఆత్మకూరు, పున్నమి: దసరా సెలవుల నేపథ్యంలో తల్లిదండ్రులు పిల్లల భద్రత పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆత్మకూరు సీఐ గంగాధర్ సూచించారు. సెలవుల సమయంలో పిల్లలు ఆడుకునేందుకు నీటి కుంటలు, బావుల వద్దకు వెళ్లే అవకాశం ఉన్నందున వారిని నిరంతరం గమనిస్తూ ఉండాలన్నారు. ప్రమాదాలు జరిగే ప్రాంతాలకు పిల్లలు వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగల సమీపంలో ఆటలాడటం ప్రమాదకరమని పిల్లలకు అవగాహన కల్పించాలన్నారు. సెలవులను వృథా చేయకుండా చదువుకు ఉపయోగపడే శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలని తెలిపారు. పిల్లల భద్రత విషయంలో తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఐ గంగాధర్ కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *