Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఆత్మకూరులో వృద్ధుడిపై దాడి.. పెన్షన్ డబ్బులు అపహరణ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఆత్మకూరులో వృద్ధుడిపై దాడి.. పెన్షన్ డబ్బులు అపహరణ

వార్త ముఖ్యాంశాలు

  • ఆత్మకూరు పట్టణంలోని దర్గా సెంటర్‌లో వృద్ధుడిపై దాడి చేసి నగదు అపహరించిన ఘటన కలకలం రేపింది.
  • నాగులపాడు గ్రామానికి చెందిన నారయ్య అనే వృద్ధుడు కొంతకాలంగా ఆత్మకూరులో ఒంటరిగా నివసిస్తున్నాడు.
  • ఈ నెల 1న పెన్షన్‌గా వచ్చిన డబ్బులతో పాటు తన వద్ద ఉన్న నగదును కలిపి మొత్తం రూ.4,500ను ఉంచుకుని దర్గా సెంటర్‌లో నిద్రిస్తున్నాడు.

ఆత్మకూరు పట్టణంలోని దర్గా సెంటర్‌లో వృద్ధుడిపై దాడి చేసి నగదు అపహరించిన ఘటన కలకలం రేపింది. నాగులపాడు గ్రామానికి చెందిన నారయ్య అనే వృద్ధుడు కొంతకాలంగా ఆత్మకూరులో ఒంటరిగా నివసిస్తున్నాడు. ఈ నెల 1న పెన్షన్‌గా వచ్చిన డబ్బులతో పాటు తన వద్ద ఉన్న నగదును కలిపి మొత్తం రూ.4,500ను ఉంచుకుని దర్గా సెంటర్‌లో నిద్రిస్తున్నాడు. ఈ సమయంలో కొందరు యువకులు తనపై దాడి చేసి నగదు ఎత్తుకెళ్లినట్లు బాధితుడు వాపోయాడు. తనకు న్యాయం చేయాలని కోరాడు. ఆకతాయిల ఆగడాలను అరికట్టాలని స్థానికులు పోలీసులను కోరుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *