Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేడే

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేడే

వార్త ముఖ్యాంశాలు

  • నెల్లూరుకు సంబంధించి డీకేడబ్ల్యూ కళాశాలలో నిర్వహణ – కౌంటింగ్‌కు సిద్ధం చేసిన అధికారులు – కౌంటింగ్ ఏజెంట్లను నియమించుకున్న ఆయా అభ్యర్థులు ఈ నెల 1వ తేదీన జరిగిన మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు మంగళవారం జరగనుంది.
  • ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను సంబంధిత అధికారులు ఇప్పటికే సిద్ధం చేసి ఉన్నారు.
  • నెల్లూరు మేయర్ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు నగరంలోని డీకేడబ్ల్యూ కళాశాలలో జరగనుంది.

నెల్లూరుకు సంబంధించి డీకేడబ్ల్యూ కళాశాలలో నిర్వహణ
– కౌంటింగ్‌కు సిద్ధం చేసిన అధికారులు
– కౌంటింగ్ ఏజెంట్లను నియమించుకున్న ఆయా అభ్యర్థులు

ఈ నెల 1వ తేదీన జరిగిన మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు మంగళవారం జరగనుంది. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను సంబంధిత అధికారులు ఇప్పటికే సిద్ధం చేసి ఉన్నారు. నెల్లూరు మేయర్ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు నగరంలోని డీకేడబ్ల్యూ కళాశాలలో జరగనుంది. ఇప్పటికే పోటీలో ఉన్న అభ్యర్థులు తమ తమ ఏజెంట్లను నియమించుకుని, సంబంధిత రిటర్నింగ్ అధికారి వద్ద అనుమతులు తీసుకుని ఉన్నారు.

మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు కౌంటింగ్ జరగనుంది. కార్పొరేటర్ అభ్యర్థులకు సంబంధించిన ఫలితాలు తొలుత వెలువడనుండగా, మేయర్‌కు సంబంధించిన ఫలితాలు విడుదలయ్యేందుకు మంగళవారం పొద్దుపోయే అవకాశం కనిపిస్తోంది. ఉదయం 7 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుండగా, మంగళవారం విరామం లేకుండా ఓట్ల లెక్కింపు జరగనుంది. డీకేడబ్ల్యూ కళాశాలలో ఉంచిన బ్యాలెట్ బాక్సులకు కలెక్టర్ ఆదేశాలతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసి ఉన్నారు.

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *