Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఆత్మకూరులో నేరాలకు నో ఛాన్స్.. PD యాక్ట్‌తో కఠిన చర్య

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ఆత్మకూరులో నేరాలకు నో ఛాన్స్.. PD యాక్ట్‌తో కఠిన చర్య

వార్త ముఖ్యాంశాలు

  • ఆత్మకూరు పట్టణానికి చెందిన ఉదయగిరి వెంకటేశ్వర్లును పోలీసులు PD యాక్ట్ కింద అరెస్టు చేసి కడప సెంట్రల్ జైలుకు తరలించారు.
  • రెండు NDPS కేసుల్లో అతని ప్రమేయం ఉన్నట్లు గుర్తించిన నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపట్టినట్లు ఆత్మకూరు సీఐ గంగాధర్, ఎస్‌ఐ జంపాని కుమార్ తెలిపారు.
  • వరుసగా నేరాలకు పాల్పడుతూ ప్రజలకు ఇబ్బందులు కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవని వారు హెచ్చరించారు.

ఆత్మకూరు పట్టణానికి చెందిన ఉదయగిరి వెంకటేశ్వర్లును పోలీసులు PD యాక్ట్ కింద అరెస్టు చేసి కడప సెంట్రల్ జైలుకు తరలించారు. రెండు NDPS కేసుల్లో అతని ప్రమేయం ఉన్నట్లు గుర్తించిన నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపట్టినట్లు ఆత్మకూరు సీఐ గంగాధర్, ఎస్‌ఐ జంపాని కుమార్ తెలిపారు. వరుసగా నేరాలకు పాల్పడుతూ ప్రజలకు ఇబ్బందులు కలిగించే వారిపై కఠిన చర్యలు తప్పవని వారు హెచ్చరించారు. గంజాయి, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడే వ్యక్తులపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని పోలీసులు స్పష్టం చేశారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ప్రజలకు సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *