వార్త ముఖ్యాంశాలు
- ఆత్మకూరు: పట్టణంలోని టిట్కో అపార్ట్మెంట్ ప్రాంగణంలో ఉన్న శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమం భక్తిప్రపత్తులతో నిర్వహించారు.
- ఈ సందర్భంగా ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించి స్వామివారికి పూజలు, భజనలు చేపట్టారు.ఆత్మకూరు పట్టణంతో పాటు సమీప గ్రామాలకు చెందిన సుమారు 700 మంది అయ్యప్ప మాలధారులు, భక్తులు ఈ కార్యక్రమానికి తరలివచ్చారు.
- స్వామివారి నామస్మరణ, భక్తిగీతాలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
ఆత్మకూరు: పట్టణంలోని టిట్కో అపార్ట్మెంట్ ప్రాంగణంలో ఉన్న శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమం భక్తిప్రపత్తులతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించి స్వామివారికి పూజలు, భజనలు చేపట్టారు.ఆత్మకూరు పట్టణంతో పాటు సమీప గ్రామాలకు చెందిన సుమారు 700 మంది అయ్యప్ప మాలధారులు, భక్తులు ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. స్వామివారి నామస్మరణ, భక్తిగీతాలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. భక్తులు పడిపూజలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.అయ్యప్ప స్వామి కృపతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని భక్తులు ఆకాంక్షించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనడంతో పడిపూజ కార్యక్రమం వైభవంగా సాగింది.