వార్త ముఖ్యాంశాలు
- ఆటో డ్రైవర్ ల సమస్యల పరిష్కారం, హక్కుల సాధన కోసం ఆగస్టు 24 నుంచి ఆటో యూనియన్ ఓనర్ల, డ్రైవర్లు చేపట్టిన నిరవధిక సమ్మెకు పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు సీపీఐ (ఏఏం) జిల్లా కార్యదర్శి సంకె రవి తెలిపారు.
- ఆదివారం బెల్లంపల్లి మండలం సోమగూడెంలో ఆటో యూనియన్ నాయకులను కలిశారు.
- ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయ్యకుండా ఆటో, ట్రాలీ, స్కూల్ బస్సులు, ఇతర వాహనాలను నడుపు కుంటూ చాలి చాలని ఆదాయాలతో బ్రతుకుతున్న వారి వృత్తిని దెబ్బతిసే విదంగా ప్రభుత్వం వ్యవరిస్తున్నదన్నారు.
ఆటో డ్రైవర్ ల సమస్యల పరిష్కారం, హక్కుల సాధన కోసం ఆగస్టు 24 నుంచి ఆటో యూనియన్ ఓనర్ల, డ్రైవర్లు చేపట్టిన నిరవధిక సమ్మెకు పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు సీపీఐ (ఏఏం) జిల్లా కార్యదర్శి సంకె రవి తెలిపారు. ఆదివారం బెల్లంపల్లి మండలం సోమగూడెంలో ఆటో యూనియన్ నాయకులను కలిశారు. ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయ్యకుండా ఆటో, ట్రాలీ, స్కూల్ బస్సులు, ఇతర వాహనాలను నడుపు కుంటూ చాలి చాలని ఆదాయాలతో బ్రతుకుతున్న వారి వృత్తిని దెబ్బతిసే విదంగా ప్రభుత్వం వ్యవరిస్తున్నదన్నారు. లక్షలాది మంది ఆటో డ్రైవర్ లను రోడ్డు పాలు చేయకుండా వారి సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా జేఏసీ అధ్యక్షుడు కట్ట రామ్ కుమార్
మంచిర్యాల జిల్లా జేఏసీ సెక్రెటరీ దూడం రాజు
మరియు జేఏసీ నాయకులు దుర్గం రామారావు బండారి వీరయ్య దుర్గం రమేష్ లింగమయ్య తదితరులు పాల్గొన్నారు