వార్త ముఖ్యాంశాలు
- మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం, పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న అక్రమ ఇసుక రవాణాను తక్షణమే అరికట్టాలని కోరుతూ ట్రాక్టర్ యజమానులు సోమవారం మంచిర్యాల జిల్లా కలెక్టర్కు ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు అందజేశారు.
- అక్రమ ఇసుక తరలింపు వల్ల ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం గండి పడటంతో పాటు, నిబంధనల ప్రకారం ఇసుక రవాణా చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ట్రాక్టర్ యజమానులు, డ్రైవర్లు, కార్మికుల ఉపాధి దెబ్బతింటోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
- బెల్లంపల్లి ప్రాంతంలో సుమారు 150 కుటుంబాలు ప్రత్యక్షంగా, మరో 900 కుటుంబాలు పరోక్షంగా ఇసుక రవాణాపై ఆధారపడి జీవిస్తున్నాయని తెలిపారు.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం, పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న అక్రమ ఇసుక రవాణాను తక్షణమే అరికట్టాలని కోరుతూ ట్రాక్టర్ యజమానులు సోమవారం మంచిర్యాల జిల్లా కలెక్టర్కు ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు అందజేశారు. అక్రమ ఇసుక తరలింపు వల్ల ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం గండి పడటంతో పాటు, నిబంధనల ప్రకారం ఇసుక రవాణా చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ట్రాక్టర్ యజమానులు, డ్రైవర్లు, కార్మికుల ఉపాధి దెబ్బతింటోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
బెల్లంపల్లి ప్రాంతంలో సుమారు 150 కుటుంబాలు ప్రత్యక్షంగా, మరో 900 కుటుంబాలు పరోక్షంగా ఇసుక రవాణాపై ఆధారపడి జీవిస్తున్నాయని తెలిపారు. అనుమతులు లేకుండా ఇసుకను తరలించడం వల్ల ప్రభుత్వ ఆదాయానికి నష్టం వాటిల్లడంతో పాటు, చట్టబద్ధంగా రవాణా చేస్తున్న ట్రాక్టర్ యజమానులకు గిట్టుబాటు కావడం లేదని పేర్కొన్నారు.
ప్రభుత్వ ఆదాయానికి గండి.. అక్రమ రవాణాకు అడ్డుకట్ట ఎప్పుడు?
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇసుక రవాణా చేస్తే ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుందని, అదే అక్రమంగా ఇసుక తరలిస్తే ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ఆదాయం కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని ట్రాక్టర్ యజమానులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బెల్లంపల్లి ప్రాంతంలో ఇసుక తవ్వకాలు, రవాణాపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు.
అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న వాహనాలను గుర్తించి, వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మైనింగ్, రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేయాలని కోరారు.
చట్టబద్ధంగా రవాణా చేసుకునే వారికి న్యాయం చేయాలి
అక్రమాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇసుక రవాణా చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ట్రాక్టర్ యజమానులకు న్యాయం చేయాలని కోరారు. ప్రజావాణిలో అందజేసిన ఫిర్యాదుపై జిల్లా కలెక్టర్ స్పందించి, ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలగకుండా, తమ ఉపాధి దెబ్బతినకుండా తగిన చర్యలు తీసుకోవాలని ట్రాక్టర్ యజమానులు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ట్రాక్టర్ అసోసియేషన్ అధ్యక్షులు వరకుట్టి రాజు, ప్రధాన కార్యదర్శి సింగతి రామకృష్ణ, కోశాధికారి, అన్నం కుమారస్వామి ట్రాక్టర్ యజమాని అసం సందీప్ ట్రాక్టర్ అసోసియేషన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు
వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్