Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
Featured

ఆగి ఉన్న లారీని ఢీకొన్న టెంపో…. ఏడుగురు దుర్మరణం…..

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఆగి ఉన్న లారీని ఢీకొన్న టెంపో…. ఏడుగురు దుర్మరణం…..

వార్త ముఖ్యాంశాలు

  • బుచ్చిరెడ్డిపాలెం మార్చి 28 ( పున్నమి విలేఖరి ) మండలంలో దామరమడుగు వద్ద లారీని టెంపో వాహనం ఢీకొట్టింది.
  • ఈ ప్రమాదంలో టెంపోలో ప్రయాణిస్తున్న ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు.
  • మృతులు తమిళనాడు వాసులు.

బుచ్చిరెడ్డిపాలెం మార్చి 28 ( పున్నమి విలేఖరి )
మండలంలో దామరమడుగు వద్ద లారీని టెంపో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టెంపోలో ప్రయాణిస్తున్న ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు.
మృతులు తమిళనాడు వాసులు. చెన్నై నుంచి వచ్చిన వీరంతా ఆధ్యాత్మికయాత్ర ముగించుకుని నెల్లూరుకు పయనమయ్యారు.
తెల్లవారుజామున 2.15 గంటల సమయంలో దామరమడుగు శివారులోకి రాగానే పెట్రోల్‌ బంక్‌ వద్ద ఆగిఉన్న లారీని టెంపో వాహనం ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో టెంపో ముందు భాగం నుజ్జునుజ్జవడంతో డ్రైవర్‌ గుర్నాథంతో పాటు, వాహనంలో ముందుకూర్చున్న మరో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రగాయాలైన వారిని నెల్లూరు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మరొకరు మృతి చెందారు. 8మంది గాయాలతో బయటపడ్డారు.. ప్రమాదం జరిగిన సమయంలో టెంపోలో 15 మంది ఉన్నారు. సమాచారమందుకున్న సీఐ సురేశ్‌బాబు మరియు సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గురైన వాహనాన్ని పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు.
డ్రైవర్‌ నిద్రమత్తు, పొగ మంచు కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *