వార్త ముఖ్యాంశాలు
- విశాఖపట్నం , ఆగస్టు 24: జీవీఎంసీ ముడసరలోవ రిజర్వాయర్‌కు సంబంధించిన 350 ఎం.ఎం.
- డయా పంపింగ్ లైన్‌ను టీఎస్‌ఆర్ నుంచి వచ్చే పంపింగ్ లైన్‌కు ఇంటర్ కనెక్షన్ చేసే పనులను చేపట్టనున్నందున, ఆగస్టు 25, 2026న(మంగళవారం) జీవీఎంసీ పరిధిలోని 12, 13 వార్డులలో ప్రాంతాల్లో మంచినీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని జీవీఎంసీ తాగునీటి విభాగం కార్యనిర్వాహక ఇంజనీర్ సుధాకర్ సోమవారం ఒక…
- తాగునీరు సరఫరా అంతరాయం కారణంగా ప్రజలకు కలిగే అసౌకర్యానికి చింతిస్తున్నామని, ప్రజలు జీవీఎంసీ కి సహకరించాలని కోరారు.అత్యవసరమైన ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నీటి ట్యాంకర్ల ద్వారా మంచినీటి సరఫరా చేసేందుకు అవసరమైన చర్యలు చేపడతామని కార్యనిర్వాహక ఇంజనీర్ తెలిపారు.పౌర సంబంధాల అధికారి జీవీఎంసీ.
విశాఖపట్నం , ఆగస్టు 24: జీవీఎంసీ ముడసరలోవ రిజర్వాయర్‌కు సంబంధించిన 350 ఎం.ఎం. డయా పంపింగ్ లైన్‌ను టీఎస్‌ఆర్ నుంచి వచ్చే పంపింగ్ లైన్‌కు ఇంటర్ కనెక్షన్ చేసే పనులను చేపట్టనున్నందున, ఆగస్టు 25, 2026న(మంగళవారం) జీవీఎంసీ పరిధిలోని 12, 13 వార్డులలో ప్రాంతాల్లో మంచినీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని జీవీఎంసీ తాగునీటి విభాగం కార్యనిర్వాహక ఇంజనీర్ సుధాకర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఇంటర్ కనెక్షన్ మరమ్మతు పనుల కారణంగా జీవీఎంసీ 13వ వార్డు పరిధిలోని భగత్‌సింగ్ నగర్, 40 గజాల రోడ్డు, అలాగే 12వ వార్డు పరిధిలోని నెహ్రూ నగర్-1 & 2, దుర్గానగర్, ఎర్నీ దుర్గానగర్ ప్రాంతాల్లో మంచినీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. తాగునీరు సరఫరా అంతరాయం కారణంగా ప్రజలకు కలిగే అసౌకర్యానికి చింతిస్తున్నామని, ప్రజలు జీవీఎంసీ కి సహకరించాలని కోరారు.అత్యవసరమైన ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నీటి ట్యాంకర్ల ద్వారా మంచినీటి సరఫరా చేసేందుకు అవసరమైన చర్యలు చేపడతామని కార్యనిర్వాహక ఇంజనీర్ తెలిపారు.పౌర సంబంధాల అధికారి జీవీఎంసీ.