Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అన్నమయ్య

ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐపీఎస్ అధికారుల బదిలీలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐపీఎస్ అధికారుల బదిలీలు

వార్త ముఖ్యాంశాలు

  • ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐపీఎస్ అధికారుల బదిలీలు రాష్ట్రంలో పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెప్టెంబర్ 20, 2026న ఉత్తర్వులు జారీ చేసింది (G.O.Rt.No.1829).
  • పరిపాలనా కారణాల దృష్ట్యా ఈ బదిలీలు , పోస్టింగ్‌లు తక్షణమే అమల్లోకి వస్తాయని సాధారణ పరిపాలన శాఖ తన ఆదేశాల్లో పేర్కొంది.
  • ఈ ఉత్తర్వుల ప్రకారం జరిగిన బదిలీల వివరాలు ఇలా ఉన్నాయి: సి.ఎం.

ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐపీఎస్ అధికారుల బదిలీలు
రాష్ట్రంలో పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెప్టెంబర్ 20, 2026న ఉత్తర్వులు జారీ చేసింది (G.O.Rt.No.1829). పరిపాలనా కారణాల దృష్ట్యా ఈ బదిలీలు , పోస్టింగ్‌లు తక్షణమే అమల్లోకి వస్తాయని సాధారణ పరిపాలన శాఖ తన ఆదేశాల్లో పేర్కొంది. ఈ ఉత్తర్వుల ప్రకారం జరిగిన బదిలీల వివరాలు ఇలా ఉన్నాయి:
సి.ఎం. త్రివిక్రమ్ వర్మ: ప్రస్తుతం ఎస్.పి.ఎఫ్ డీజీగా ఉన్న ఈయనను.. ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ / డైరెక్టర్ ఎఫ్.ఎస్.ఎల్ (FSL) గా బదిలీ చేశారు.
ఆర్. జయలక్ష్మి: ఏసీబీ డైరెక్టర్‌గా ఉన్న ఆమెను.. సీఐడీ సైబర్ క్రైమ్స్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీ) గా నియమించారు.
బి. రాజకుమారి: ఏపీఎస్పీ బెటాలియన్స్ ఐజీగా ఉన్న ఈమెను రైల్వేస్ ఐజీగా బదిలీ చేస్తూ, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు సీఐడీ ఉమెన్ సేఫ్టీ ఐజీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.
కాంతి రాణా టాటా: పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న ఈయనకు డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ ఐజీగా పోస్టింగ్ ఇచ్చారు.
విశాల్ గున్ని: పోస్టింగ్ కోసం వెయిటింగ్ లో ఉన్న ఈయనను డీఐజీ (ట్రైనింగ్)గా నియమించి, అప్పా (APPA) డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు.
బాబూజీ అట్టాడ: గ్రేహౌండ్స్ డీఐజీగా ఉన్న ఈయనను టెక్నికల్ సర్వీసెస్ డీఐజీగా బదిలీ చేస్తూ, గ్రేహౌండ్స్ డీఐజీగా పూర్తి అదనపు బాధ్యతలు కేటాయించారు.
పంకజ్ కుమార్ మీనా: పోలవరం ఓఎస్డీగా ఉన్న ఈయనను మార్కాపురం జిల్లా ఎస్పీగా బదిలీ చేశారు.
జగదీష్ అడహళ్లి: సీఎమ్ఎస్జీ ఎస్పీగా ఉన్న ఈయనను పల్నాడు జిల్లా ఎస్పీగా నియమించారు.
కె. చక్రవర్తి: సీఐడీ ఎస్పీగా ఉన్న ఈయనను పోలవరం జిల్లా ఎస్పీగా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *