Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నిర్మల్

అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన ఆమ్ ఆద్మీ పార్టీ నేతల ముందస్తు అరెస్ట్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన ఆమ్ ఆద్మీ పార్టీ నేతల ముందస్తు అరెస్ట్

వార్త ముఖ్యాంశాలు

  • నిర్మల్ జిల్లా సెప్టెంబర్ 07 (పున్నమి ప్రతినిధి) ముధోల్: మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టి, మహిళలకు పూర్తి భద్రత కల్పించడంతో పాటు పూర్తిస్థాయి మహిళా హోం మంత్రిని నియమించాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి బయలుదేరిన ఆమ్ ఆద్మీ పార్టీ ముదోల్ నియోజకవర్గ లోకేశ్వరం మండల్…
  • ఈ అరెస్ట్‌లను జిల్కరి చిన్నన్న తీవ్రంగా ఖండించారు.
  • శిరీషకు న్యాయం చేయాలని, ఆమె కుటుంబానికి రూ.కోటి పరిహారం అందించడంతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

నిర్మల్ జిల్లా సెప్టెంబర్ 07 (పున్నమి ప్రతినిధి)
ముధోల్: మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టి, మహిళలకు పూర్తి భద్రత కల్పించడంతో పాటు పూర్తిస్థాయి మహిళా హోం మంత్రిని నియమించాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి బయలుదేరిన ఆమ్ ఆద్మీ పార్టీ ముదోల్ నియోజకవర్గ లోకేశ్వరం మండల్ కి చెందిన జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ జిల్కరి చిన్నన్నతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు.

ఈ అరెస్ట్‌లను జిల్కరి చిన్నన్న తీవ్రంగా ఖండించారు. శిరీషకు న్యాయం చేయాలని, ఆమె కుటుంబానికి రూ.కోటి పరిహారం అందించడంతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపే హక్కును అడ్డుకోవడం సరికాదని అన్నారు. మహిళల భద్రత, న్యాయం కోసం ఆమ్ ఆద్మీ పార్టీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *