Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అల్లూరి సీతారామరాజు

అల్లూరి జిల్లాలో 6 జడ్పీటీసీ, 5 ఎంపీపీ స్థానాలను ఎస్టీ మహిళలకే రిజర్వ్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
అల్లూరి జిల్లాలో 6 జడ్పీటీసీ, 5 ఎంపీపీ స్థానాలను ఎస్టీ మహిళలకే రిజర్వ్

వార్త ముఖ్యాంశాలు

  • పాడేరు, అక్టోబర్ 14: అల్లూరి సీతారామరాజు జిల్లాలో రెండో సాధారణ ఎన్నికలు–2026కు సంబంధించి స్థానిక సంస్థల రిజర్వేషన్లను జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి టి.
  • నిశాంతి బుధవారం ప్రకటించారు.
  • జిల్లాలోని 11 మండలాల్లో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌, జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలన్నీ షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ)కు కేటాయించారు.

పాడేరు, అక్టోబర్ 14: అల్లూరి సీతారామరాజు జిల్లాలో రెండో సాధారణ ఎన్నికలు–2026కు సంబంధించి స్థానిక సంస్థల రిజర్వేషన్లను జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి టి. నిశాంతి బుధవారం ప్రకటించారు. జిల్లాలోని 11 మండలాల్లో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌, జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలన్నీ షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ)కు కేటాయించారు. ఏజెన్సీ ప్రాంతం కావడంతో ఎస్టీలకు ప్రాధాన్యం లభించగా, జడ్పీటీసీ స్థానాల్లో ఆరు మహిళలకు, ఐదు జనరల్‌కు, ఎంపీపీ స్థానాల్లో ఐదు మహిళలకు, ఆరు జనరల్‌కు రిజర్వ్ చేశారు.
జిల్లాలో మొత్తం 172 ఎంపీటీసీ స్థానాలుండగా, 155 ఎస్టీలకు, 17 అన్‌రిజర్వుడ్‌ (యూఆర్‌) కేటగిరీకి కేటాయించారు. ఎంపీటీసీ స్థానాల్లో 84 మహిళలకు, 88 జనరల్‌ కేటగిరీకి దక్కాయి. ఎస్సీ, బీసీలకు ఒక్క స్థానం కూడా కేటాయించలేదు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం–1994లోని సెక్షన్ 268(1), హైకోర్టు అక్టోబర్ 1న ఇచ్చిన ఆదేశాలు, ప్రభుత్వం అక్టోబర్ 12న జారీ చేసిన జీవో ఎంఎస్ నం.154 ప్రకారం రిజర్వేషన్లను ఖరారు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ రిజర్వేషన్లతో జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *