Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

అర్జీలపై రిమార్క్స్‌ ఏవీ? ఎంపీడీవోను నిలదీసిన బాధితుడు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
అర్జీలపై రిమార్క్స్‌ ఏవీ? ఎంపీడీవోను నిలదీసిన బాధితుడు

వార్త ముఖ్యాంశాలు

  • - 15 రోజులుగా స్పందన లేదని ఆరోపణలు ఓటర్ల జాబితా ప్రక్రియ చివరి రోజున అధికారుల తీరుపై ప్రశ్నలు చిట్వేలు మండలంలో అర్జీల పరిష్కారంపై అధికారుల స్పందన తీరును ప్రశ్నిస్తూ బాధితుడు బుంగటవల రాజశేఖర్‌ ఎంపీడీవోను నిలదీశారు.
  • 15 రోజుల క్రితం సమర్పించిన అర్జీలపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో, వాటిపై చేసిన రిమార్క్స్‌ ఏమిటో వెల్లడించాలని కోరారు.
  • “మేము అధికార పార్టీ క్లస్టర్‌గా అర్జీలు ఇచ్చాం కదా..

– 15 రోజులుగా స్పందన లేదని ఆరోపణలు ఓటర్ల జాబితా ప్రక్రియ చివరి రోజున అధికారుల తీరుపై ప్రశ్నలు

చిట్వేలు మండలంలో అర్జీల పరిష్కారంపై అధికారుల స్పందన తీరును ప్రశ్నిస్తూ బాధితుడు బుంగటవల రాజశేఖర్‌ ఎంపీడీవోను నిలదీశారు. 15 రోజుల క్రితం సమర్పించిన అర్జీలపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో, వాటిపై చేసిన రిమార్క్స్‌ ఏమిటో వెల్లడించాలని కోరారు. “మేము అధికార పార్టీ క్లస్టర్‌గా అర్జీలు ఇచ్చాం కదా.. వాటిపై మీరు ఏం రిమార్క్స్‌ ఇచ్చారో ఒక్కసారి చూపించండి” అంటూ రాజశేఖర్‌ ఎంపీడీవోను ప్రశ్నించారు. ఇప్పటికే అర్జీలు సమర్పించి 15 రోజులు దాటిందని, ఈరోజు ఓటర్ల జాబితా ప్రక్రియకు చివరి రోజు కావడంతో తమ అర్జీలపై స్పందన ఏమిటని అడిగారు. అయితే, తన ప్రశ్నలకు ఎంపీడీవో నుంచి స్పష్టమైన సమాధానం రాలేదని రాజశేఖర్‌ ఆరోపించారు. అర్జీలపై చేసిన రిమార్క్స్‌ చూపించాలని కోరినా స్పందించకపోవడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల కార్యాలయంలో సమర్పించిన అర్జీల పరిస్థితి, వాటిపై తీసుకున్న చర్యలను బాధితులకు తెలియజేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అర్జీలపై వెంటనే స్పందించి, సంబంధిత రిమార్క్స్‌ను వెల్లడించాలని రాజశేఖర్‌ కోరారు. ఓటర్ల జాబితా ప్రక్రియ చివరి రోజునైనా తమ సమస్యలపై అధికారులు స్పష్టత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఆరోపణలపై ఎంపీడీవో వివరణ ఇవ్వాల్సి ఉంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *