Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అల్లూరి సీతారామరాజు

అరకు: సామాజిక చైతన్యానికి జాషువా సాహిత్యం ప్రతీక

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
అరకు: సామాజిక చైతన్యానికి జాషువా సాహిత్యం ప్రతీక

వార్త ముఖ్యాంశాలు

  • అరకులోయ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ డా.
  • ఆర్.
  • కుసుమ కుమారి ఆదేశాల మేరకు తెలుగు విభాగం ఆధ్వర్యంలో మహాకవి గుర్రం జాషువా 131వ జయంతి ఘనంగా నిర్వహించారు.

అరకులోయ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ డా. ఆర్. కుసుమ కుమారి ఆదేశాల మేరకు తెలుగు విభాగం ఆధ్వర్యంలో మహాకవి గుర్రం జాషువా 131వ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాషువా చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ జాషువా తెలుగు సాహిత్యంలో సామాజిక చైతన్యాన్ని తీసుకువచ్చిన గొప్ప కవి అని పేర్కొన్నారు. కుల, మత, సామాజిక వివక్షలను ప్రశ్నిస్తూ సమానత్వం, మానవత్వం, సామాజిక న్యాయ విలువలను రచనల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లారని వైస్‌ ప్రిన్సిపాల్ పి. చలపతి రావు తెలిపారు. అధ్యాపకులు ఎం. రోజారాణి, డా. బి. సుభాన్, డా. సి.హెచ్. మురళీకృష్ణ జాషువా సాహిత్య విశిష్టతను వివరించారు. కార్యక్రమంలో అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *