Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

అమ్మకు అక్షరమాల పరీక్ష – ఘనంగా నిర్వహించిన ఉల్లాస్ ఎగ్జామ్స్ లో పాల్గొన్న.. ఖానాపురం సర్పంచ్ దాసరి రమేష్.

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
అమ్మకు అక్షరమాల పరీక్ష – ఘనంగా నిర్వహించిన ఉల్లాస్ ఎగ్జామ్స్ లో పాల్గొన్న.. ఖానాపురం సర్పంచ్ దాసరి రమేష్.

ఖానాపురం పున్నమి ప్రతినిధి: ఖానాపురం మండలం కేంద్రంలో నిర్వహించిన
సెర్ప్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఉల్లాస్ – నవ భారత సాక్షరత కార్యక్రమంలో భాగంగా ఖానాపూర్ మండల కేంద్రంలో అమ్మకు అక్షరమాల పరీక్ష నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్పంచ్ దాసరి రమేష్, ఏపీఎం రమాదేవి హాజరు కాగా గ్రామంలోని నిరక్షరాస్యులైన తల్లులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎంతో ఉత్సాహంగా పరీక్ష రాశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ దాసరి రమేష్ గారు మాట్లాడుతూ, మహిళలు తలుచుకుంటే సాధించనిది అంటూ ఏమీ లేదని, దీని ద్వారా మన గ్రామం పూర్తి అక్షరాస్యత గ్రామంగా వెలుగొందుతుందని, దీనికి కారకులు మీరే అవుతారని తెలిపారు.
అమ్మలు అక్షరాలు దిద్దడం, చదువుకు వయసుతో సంబంధం లేదని నిరూపించడం చాలా అభినందనీయమని అన్నారు. ప్రతి ఒక్కరూ చదవడం, రాయడం నేర్చుకోవాలనే లక్ష్యంతోనే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏపీఎం రమాదేవి, సీసీ పద్మ మహిళా సంఘాల సిఎ లు శ్రీలత, శ్రీదేవి,సునీత, భవాని, హంస రాణి, సంఘ సభ్యులు, పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.

అమ్మకు అక్షరమాల పరీక్ష – ఘనంగా నిర్వహించిన ఉల్లాస్ ఎగ్జామ్స్ లో పాల్గొన్న.. ఖానాపురం సర్పంచ్ దాసరి రమేష్.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *