Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
E-పేపర్

అన్న క్యాంటీన్లు సందర్శించిన ఇంచార్జ్ కమిషనర్ సత్యనారాయణ*

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
అన్న క్యాంటీన్లు సందర్శించిన ఇంచార్జ్ కమిషనర్ సత్యనారాయణ*

వార్త ముఖ్యాంశాలు

  • *కాకినాడ జిల్లా కాకినాడ నగరం:* రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ ద్వారా పేదలకు కేవలం ఐదు రూపాయలకే నాణ్యమైన, పౌష్టికాహారం అందిస్తున్నామని కాకినాడ నగరపాలక సంస్థ ఇంచార్జ్ కమిషనర్ ఎన్.పి.వి.
  • సత్యనారాయణ తెలిపారు.శుక్రవారం ఆయన కాకినాడ జగన్నాధపురం అన్నమ్మఘాటి సెంటర్ వద్ద గల అన్న క్యాంటీన్‌ను సందర్శించి ఏర్పాట్లు, సౌకర్యాలను పరిశీలించారు.
  • ఈ సందర్భంగా నేరుగా ప్రజలతో మాట్లాడి క్యాంటీన్ సేవలపై అభిప్రాయాలు తెలుసుకున్నారు.

*కాకినాడ జిల్లా కాకినాడ నగరం:* రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ ద్వారా పేదలకు కేవలం ఐదు రూపాయలకే నాణ్యమైన, పౌష్టికాహారం అందిస్తున్నామని కాకినాడ నగరపాలక సంస్థ ఇంచార్జ్ కమిషనర్ ఎన్.పి.వి. సత్యనారాయణ తెలిపారు.శుక్రవారం ఆయన కాకినాడ జగన్నాధపురం అన్నమ్మఘాటి సెంటర్ వద్ద గల అన్న క్యాంటీన్‌ను సందర్శించి ఏర్పాట్లు, సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా నేరుగా ప్రజలతో మాట్లాడి క్యాంటీన్ సేవలపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. సిబ్బంది పనితీరును కూడా ఆయన పరిశీలించి సూచనలు చేశారు.అన్న క్యాంటీన్‌లో అన్ని సౌకర్యాలు సక్రమంగా ఉన్నాయని, అందుతున్న సేవల పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నామని ప్రజలు ఇంచార్జ్ కమిషనర్‌కు తెలిపారు. మీడియాతో మాట్లాడిన ఆయన, అన్న క్యాంటీన్ సేవలపై ప్రజల్లో మంచి స్పందన ఉందని, భవిష్యత్తులో అవసరమైతే మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రజల నుంచి నిరంతరం ఫీడ్బ్యాక్తీ తీసుకుంటామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృధ్వి చరణ్, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *