అనపర్తి, అక్టోబరు 5 (పున్నమి ప్రతినిధి): ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని సెప్టెంబరు 17 నుంచి అక్టోబరు 17 వరకు నిర్వహిస్తున్న ‘సేవా సంకల్ప్ అభియాన్’లో భాగంగా అనపర్తిలో ‘సేవా జ్యోతి యాత్ర’ను ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. ప్రజల్లో సేవాభావం, సామాజిక బాధ్యతను పెంపొందించడమే కార్యక్రమం లక్ష్యమని తెలిపారు. దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో అనపర్తి నియోజకవర్గంలోనూ పలు కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొని యాత్రను విజయవంతం చేశారు. సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు మరింత చేరువగా ఉండి, సామాజిక సంక్షేమం కోసం కూటమి శ్రేణులు నిరంతరం పనిచేస్తాయని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేశారు.
